వారసత్వం ఉన్నా… చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఒక్కొక్కసారి కష్టమైన పనే. ఒక్కొక్కరు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే, చిత్రపరిశ్రమలో నిలదొక్కుకుంటూ ఉంటారు. పాపం అక్కినేని వారి నట వార్సాడు అఖిల్ మొదటి సినిమా దెబ్బేయ్యడంతో , హిట్ సినిమా కోసం తెగ తాపత్రయ పడుతున్నాడు. ఎలా అయినా ‘హలో’ సినిమాతో మంచి హిట్టు కొట్టి ఇండ్రస్ట్రీలో యంగ్ హీరోలతో పోటీ పడాలని చూస్తున్నాడు.
సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో హలో అంటూ వస్తున్న అఖిల్ హిట్టు కోసం గట్టిగానే అసలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎన్నో ఆసక్తికర విషయాలను, తన పర్సనల్ విషయాలను గురించి మాట్లాడాడు ఈ సిసింద్రీ.
నేను మొదటిసారిగా గోవాకు కుటుంబ సభ్యులు లేకుండా ఒంటరిగా వెళ్ళాను అప్పుడు ఇంట్లో చాలా కంగారు పడ్డారు అని అఖిల్ చెప్పాడు. అప్పుడు నేను 12 వ తరగతి చదువుతున్నాను. అలాగే నేను మొదటిసారిగా నాకు ఊహ తెలియని సమయంలో నటించిన సమయంలో నాకు ఏమీ గుర్తులేదు నేను పెద్దయ్యాక ఆ సినిమా చూసి ఆనందపడ్డానని చెప్పాడు. నేను స్కూల్ చదివే రోజుల్లో సరోజ మేడం ఉండేవారు. ఆమె న గురించి చాలా ఆందోళన పడేవారు ఎందుకంటే ఆమె మా తాతగారి ఫ్యాన్. కేవలం ఆమె వల్లనే నేను తెలుగు బాగా చదువుకోగలిగాను అఖిల్ స్కూల్ డేస్ గుర్తుచేసుకున్నాడు.
అఖిల్ అన్నయ్య నాగ చైతన్య మాట్లాడుతూ… అఖిల్ గురించిన ఎవరికీ తెలియని ఎన్నో సీక్రెట్స్ బయటపెట్టాడు. అఖిల్ చాలా అల్లరిగా ఉంటూ… అర్ధరాత్రి సమయంలో ఎత్తైన గోడదూకి మరీ పారిపోయేవాడని, ఇలా ఒకసారి నాన్నకు దొరికెయ్యడంతో అఖిల్ బయటకి వెళ్లకుండా సెక్యూరిటీ పటిష్టం చేసారని.. అయినా అఖిల్ మాత్రం ఎదో ఒకరకంగా బయటకి వెళ్లిపోతుండేవాడని చెప్పాడు చైతన్య.
ఈ షోలో భాగంగా ఓ గేమ్ ఆడారు. ఆటలో భాగంగా అమీ జాక్సన్‌తో డేటింగ్ చేయాల్సి వచ్చింది. సిస్టర్ రోల్‌లో ఎవరిని ఎంపిక చేసుకొంటారు అని అడుగగా రాశీఖన్నా అని సమాధానం చెప్పాడు. తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయాలని ఉంది అని చెప్పారు. నా తరువాత సినిమా ఛాన్స్‌ను రకుల్‌కు ఇస్తాను అని అఖిల్ చెప్పాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు అఖిల్. నాకు గర్ల్‌ఫ్రెండ్ ఉంది అని ఓ ప్రశ్నకు అఖిల్ సమాధానం చెప్పారు. నాకు ఏ హీరోయిన్ కూడా డేటింగ్ అవకాశం ఇవ్వలేదు అంటూ గడుసుగా సమాధానాలు చెప్పుకొచ్చాడు ఈ అక్కినేని వారి సిసింద్రీ.