Gossipsకీర్తితో విడిపోవడానికి కారణం ఏంటో చెప్పిన సుమంత్

కీర్తితో విడిపోవడానికి కారణం ఏంటో చెప్పిన సుమంత్

పవన్ కళ్యాణ్ తో ‘తొలి ప్రేమ’సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన అమ్మాయి కీర్తి రెడ్డి… వీరిద్దరూ ప్రేమించుకొని , పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయితే చేసుకున్నారు కానీ, కలిసి జీవించడంలో మాత్రం ఇద్దరూ ఫెయిల్ అయ్యారు.పెళ్లి అయ్యి రెండేళ్లు పూర్తి కాకుండానే … విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.

ఇది జరిగి చాలా సంవత్సరాలే అవుతున్నా… కీర్తి రెడ్డి – సుమంత్ లు విడిపిపోవడానికి సరైన కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియలేదు. దీంతో దీనిమీద ఎన్నో పుకార్లు షికార్లు చేసాయి. అయితే చాలా కాలం తరువాత ఈ విషయంపై స్పందించాడు. తాము ఇద్దరం పెళ్లి చేసుకున్నాక కొంత కాలానికే అర్ధం అయ్యింది మా అలవాట్లు, అభిరుచులు వేర్వేరని అందుకే …ఇక కలిసి ఉండడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో విడిపోయాము తప్ప మా మధ్య ఎటువంటి గొడవలు లేవని సుమంత్ చెప్పుకొచ్చాడు.

ఆ తరువాత కీర్తి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో హాయిగా ఉందని.అంతకంటే నాకు సంతోషకరమైన విష్యం ఏముంటుందని సుమంత్ చెప్పుకొచ్చాడు. కీర్తితో తాను అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడుతుంటానని.. కీర్తి కుటుంబం నన్ను ఎంతో గౌరవిస్తుందని సుమంత్ చెప్పాడు. మా మధ్య గొడవలకు మా కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదని సుమంత్ తన మనసులో మాట చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news