సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని ..ఇచ్చిన తర్వాత తన పాపులారిటీని పెంచుకోవాలని ప్రతి ఒక్క హీరోయిన్ కి ఉంటుంది . అయితే అందరూ హీరోయిన్స్ అలా సిలవ్ర్ స్క్రీన్ పై స్టార్స్ గా మారలేరు. కొంతమంది ముద్దుగుమ్మలకి అందం – టాలెంట్ – నటన ఉన్నా సరే పెద్దగా చెప్పుకోతగ్గ స్థాయికి ఎదగలేరు . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ మాధవి లత. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న మాధవి లత చేసింది చాలా తక్కువ సినిమాలు.. కానీ అన్ని మంచి పేరు సంపాదించుకున్నాయి.
“నచ్చావులే” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది . ఈ సినిమాలో నచ్చావులే పాట ఎంత బాగా పాపులారిటీ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆ తర్వాత నానితో కలిసి స్నేహితుడా , అరవింద్ 2 వంటి సినిమాల్లో నటించి అల్లరించింది. అయినా ఎందుకో డైరెక్టర్ లు మాధవి లతకు ఆఫర్స్ ఇవ్వలేకపోయారు . ఈ క్రమంలోనే సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న మాధవి లత నిత్యం పలు విషయాలపై స్పందిస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.
రీసెంట్గా మాధవి లత పెళ్లిపై చేసిన పోస్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తన పెళ్లి ప్రశ్నలపై గట్టిగా కౌంటర్ ఇస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేసింది మాధవి లత . “ఓ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే మరీ ముఖ్యంగా అవసరమైంది వయసు ఒకటే కాదు ..ఆమె శారీరకంగా – మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి . పెళ్లి చేసుకోవడం అనేది బొమ్మలాట కాదు . అది ఒక పవిత్రమైన నిర్ణయం .. ప్రస్తుతం నేను శారీరకంగా మానసికంగానూ అందుకు రెడీగా లేను ..నా భవిష్యత్తుపై కూడా నాకు నమ్మకం లేదు ..ఇది నా నిర్ణయం.. ఇదే నా జీవితం ” అంటూ ఓ ఫోటోని షేర్ చేసింది. దీంతో అది చూసిన జనాలు అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోదని.. సింగిల్గానే మిగిలిపోతుంది అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు..!!