Gossipsసాహో యాక్షన్ సీన్స్ కి షాక్ ఇచ్చిన దుబాయ్..

సాహో యాక్షన్ సీన్స్ కి షాక్ ఇచ్చిన దుబాయ్..

బాహుబలి సినిమా తరువాత దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నాడు ప్రభాస్. ఆ తరువాత ప్రభాస్ నుంచి ఏ సినిమా రాబోతోందా అని అభిమానులు ఎదురుచూపులు చూస్తుండగానే… సాహో అంటూ ప్రభాస్ దూసుకువచ్చేందుకు సిద్ధం అయిపోయాడు. అయితే ఆ సోహోకి ఇప్పుడు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది.

ఈ సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలని దుబాయ్ వెళ్ళిన ‘సాహో’ టీమ్ కు అక్కడ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోవడంతో అక్కడకి వెళ్లిన సినిమా యూనిట్ వెనక్కి వచ్చేసింది.సుమారు 40 కోట్ల ఖర్చుతో కళ్ళు చెదిరిపోయే యాక్షన్ సీన్స్ దుబాయ్ లో చిత్రీకరించాలని ‘సాహో’ టీమ్ ప్లాన్ వేసుకుంది. ఈ సినిమాకు ఈ యాక్షన్ సీన్స్ చాలా కీలకం కావడంతో ప్రముఖ హాలీవుడ్ నిపుణులతో ఈటీమ్ ను సెట్ చేసి దుబాయ్ వెళ్ళినట్లు తెలుస్తోంది.

సుమారు 75 రోజుల పాటు ఈయాక్షన్ సీక్వెన్స్ తీయడానికి ‘సాహో’ టీమ్ ఏర్పాట్లు చేసుకోగా.. ఆ ఆశలన్నీ ఇప్పుడు అడియాసలు అయ్యాయి. దుబాయ్ లో ‘సాహో’ టీమ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరించాలి అని అనుకున్న కీలక ప్రదేశాలలో షూటింగ్ కు అక్కడ ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది. ‘సాహో’ టీమ్ ఎంత ప్రయత్నించినా అక్కడ ప్రభుత్వం మాత్రం ససేమిరా అందడంతో సాహో టీమ్ ఉసూరుమంది.
దీంతో ఇక చేసేది లేక ఒక టీమ్ ను ఈ పనుల నిమిత్తం అక్కడే ఉంచి మిగతా యూనిట్ సభ్యులు హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news