Gossipsఆ రాత్రి బెంగళూరులో సన్నీ లియోన్ తో _ _

ఆ రాత్రి బెంగళూరులో సన్నీ లియోన్ తో _ _

సన్నీలియోన్ తో భరతనాట్యం చేయిస్తారా అంటే నవ్వొస్తుందా ..? నమ్మలేకపోతున్నారా ..? అవును మరి కర్ణాటక ప్రభుత్వం ఇదే అంటోంది. ఏమో చేయించినా చేయించేలా ఉన్నారు మరి. ఇది ఎక్కడో ఏంటో వివరంగా తెలుసుకోవాలంటే ఈ వార్త ఆలస్యం చేయకుండా చదివెయ్యండి మరి.

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి కొత్త సంసివచ్చారం వేడుకలు జరిపేందుకు బెంగళూరులో ఏర్పాట్లు చేసుకున్నారు. దీని కోసం ముందుగానే పోర్న్ స్టార్ సన్నీలియోన్ తో ఓ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు నిర్వాహకులు. ఇంతలో కన్నడ సంఘాలు ఎంటర్ అయ్యి ఆ షో జరిపితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో చేసేది లేక ప్రభుత్వం కూడా ఆ షో కి అనుమతి నిరాకరించింది.

అయితే నిర్వాహకులు ఇప్పటికే ఈ షో కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టి ఉన్నారు .అదీ కాకుండా ఇప్పటికే భారీ స్థాయిలో అడ్వాన్సుగా సన్నీ లియోన్ కి ముట్టచెప్పి ఉన్నారు. అయితే ఇప్పుడు అది కాస్తా రద్దు అవ్వడంతో నిర్వాహకులు లబోదిబోమంటూ ప్రభుత్వం మీద ఇతరత్రా మార్గాల్లో ఒత్తిడి చేయటం మొదలు పెట్టారు.

దీంతో ప్రభుతం కూడా పునరాలోచనలో పడింది. అంతే కాదు. సన్నీ వస్తే పర్వాలేదు కానీ అసభ్య నృత్యం లేకుండా ఏ భరత నాట్యమో లేదా ఏదైనా క్లాసికల్ డాన్స్ అయితే అనుమతి ఇస్తామని అది కూడా ప్రభుత్వ అధికార పెద్దల నేతృత్వంలో జరగాలని కండిషన్ పెట్టారట. దీంతో సదరు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ లబోదిబోమంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news