సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న నయనతార . ప్రజెంట్ ఎలాంటి టాప్ మోస్ట్ పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక్కో సినిమాకి 7 నుంచి 10 కోట్లు దాకా రెమ్యూనరేషన్ అందుకుంటూ ఇండస్ట్రీలోనే ఇంత హ్యుజ్ పారితోషకం అందుకుంటున్న స్టార్ బ్యూటీగా రికార్డును నెలకొల్పింది. అయితే నయనతార ఇలాంటి వాటిలోనే కాదు డైరెక్టర్ లకి కండిషన్స్ పెట్టడంలోను టాప్ పొజిషన్ లో ఉంటుంది.
తాను సినిమా చేసే ప్రాజెక్టుకు ప్రమోషన్స్ కి రాను అని ముందే చెప్పేస్తుందట . స్టార్ హీరోలతో కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వను అంటూ తగ్గేసి చెప్పి అగ్రిమెంట్ పై సైన్ చేస్తుందట . ఇలానే గతంలో ఓ బిగెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలో ఓవరాక్షన్ చేసి చేతులారా మంచి పాత్రను మిస్ చేసుకుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా “వకీల్ సాబ్”.
ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమాలో అంజలి పాత్రలో మొదట అనుకున్న హీరోయిన్ నయనతార . చాలా క్లాస్ లుక్స్ మెరిసే ఛాన్స్ ఉన్న ఈ రోల్ ని నయనతార అయితే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అంటూ మేకర్స్ ఆమెను అప్రోచ్ అయ్యారట. అయితే నయనతార పాత్ర చిన్నగా ఉంది . ముగ్గురితో ఈక్వల్ గా ఉంది . నా పాత్రకు ప్రాధాన్యం పెంచండి ..స్క్రీన్ స్పేస్ మార్చండి అంటూ కండిషన్స్ పెట్టిందట . అంతేకాదు పవన్ తో సరి సమానంగా పాత్రను మార్చమన్నిందట. తిక్క రేగిన డైరెక్టర్ ఆమెను ఈ పాత్ర నుండి తీసేసి అందులో అంజలిని చూస్ చేసుకున్నాడు . ఈ సినిమా తర్వాత అంజలి ఏ స్థాయికి మారిందో ప్రత్యేకంగా చెప్పాలా..?