Movies"గుంటురు కారం"కి ఆ ఫ్లాప్ సినిమాతో కనెక్షన్.. అయ్యయ్యో.. కొంప ముంచేశావ్...

“గుంటురు కారం”కి ఆ ఫ్లాప్ సినిమాతో కనెక్షన్.. అయ్యయ్యో.. కొంప ముంచేశావ్ కదా త్రివిక్రమా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు రీసెంట్గా చేస్తున్న సినిమా “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది . త్వరలోనే నాలుగో షెడ్యూల్ కూడా ప్రారంభించబోతుంది . ఈ క్రమంలోనే నిన్న మహేష్ బాబు నాన్నగారు కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన మహేష్ బాబు సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను అనౌన్స్ చేశారు .

“గుంటూరు కారం” అంటూ చేతిలో కర్ర.. నోట్లో బీడి.. పెట్టుకొని చాలా మాస్ మసాలా పవర్ఫుల్ లుక్ లో చూపించారు . అయితే టైటిల్లో అక్షరాలను చాలా డిఫరెంట్ గా నోట్ చేశారు . ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తెరకెక్కించిన ఖలేజా సినిమాకి మాత్రమే చేశారు. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తెరకెక్కించిన అన్ని సినిమాలకి..”అ ఆ” అక్షరాలు డిఫరెంట్ డిఫరెంట్ గా పెడుతూ వచ్చారు .

టైటిల్లో కూడా ఆయన సెంటిమెంట్ని ఫాలో అవుతూ ఇలా పెట్టుకుంటూ వచ్చారు. ఫస్ట్ టైం మహేష్ బాబు సినిమాకి సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కొత్త రూట్ లోకి వచ్చాడు. మహేష్ బాబు సినిమాకి పాత సినిమా ఫాంట్ స్టైల్ ని మార్చారు . గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన “ఖలేజా” సినిమాకి ఏ విధంగా రాశారో టైటిల్ ..అదేవిధంగా గుంటూరు కారం సినిమాకి రాస్కొచ్చారు . ఈ క్రమంలోనే “ఖలేజా” సినిమాకి గుంటూరు కారం సినిమాకి లింక్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news