టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఎదిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గంగోత్రి సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ త్వరలోనే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడు . ప్రజెంట్ బన్నీ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుని .. త్వరలోనే మిగతా 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతుంది.
కాగా ఓ పక్క సినిమా షూట్ లో బిజీగా ఉంటూనే మరోపక్క తన నాన్న స్థాపించిన ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చాడు అల్లు అర్జున్ . ఈ క్రమంలోనే షో మొత్తం ఎంతో సందడి సందడిగా మారిపోయింది. అంతేకాదు తనదైన స్టైల్ లో ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్ ను ఆకట్టుకున్న అల్లు అర్జున్- శృతి అనే ఓ కంటెస్టెంట్ పాట పాడిన తర్వాత చెప్పి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి .
“నీ పేరు అంటే నాకెంతో ఇష్టం ..ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు శృతి ” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే శృతి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అయితే స్నేహ నెంబర్ ఎన్నోది అంటూ జనాలు కౌంటర్స్ వేస్తున్నారు. మరికొందరు అల్లు అర్జున్ ఫస్ట్ లవ్ స్నేహ కాదా..? శృతినా..? ఎవరా శృతి..? అంటూ చెప్పుకొస్తున్నారు . మరికొందరు శృతి అంటే శృతిహాసన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో అల్లు అర్జున్ ఫస్ట్ లవ్ ఎవరు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇంతకీ ఆ శృతి ఎవరు అన్నది అల్లు అర్జున్ చెప్తేనే బాగుంటుంది ..అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!