రాంగోపాల్ వర్మ… వివాదాల వర్మ… కాంట్రావర్సీల వర్మ … గజిబిజి వర్మ .. గందరగోళ వర్మ .. ఇలా చెప్పుకుంటూ పోతే రాంగోపాల్ వర్మకి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. ఎందుకంటే ఈయన వివాదాల సుడిగుండం. ఎప్పుడూ ఎవరో ఒకరిని ఎదో ఒకటి అంటే కానీ ఈ వివాదాల దర్శకుడికి గడవదేమో ..? అందుకే అందరిని కెలికి మరీ తిట్టించుకుంటాడు. మొన్నామధ్య అందరూ వరం ట్విట్ కోసం ఎదురు చూసారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయ దూకుడు పెంచడంతో అయన మీద వర్మ ఖచ్చితంగా పంచ్ వేస్తాడని ఎదురు చూసారు. కానీ ఆయన ఏమాత్రం స్పందించలేదు. తాజాగా వర్మ పవన్ మీద స్పందించాడు. నెగిటివ్ గా కాదులెండి పాజిటివ్ గా.
వర్మ తన ఫేస్ బుక్ పేజీలో పవన్పో గురించి ఓ పోస్ట్ చేసి అందరి ద్రుష్టి తన మీదకు తిప్పుకున్నాడు. . అయితే ఎప్పటిలా పవన్‌పై విరుచుకుపడకుండా.. ఈసారి పవన్ పర్యటనపై చాలా సానుకూలంగా స్పందించారు వర్మ.
‘‘నేను పవన్ కల్యాణ్‌కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా…..
పవన్ కళ్యాణ్ యొక్క తాజా ప్రసంగం ఇప్పుడే చూశాను. వివిధ అంశాలపై ఆయన అవగాహనతో ఇచ్చిన ప్రసంగం విని ఆశ్చర్యపోయాను. ఈ పర్యటనలో ఆయన తనపై గతంలో ఉన్న, ప్రస్తుతం వినిపిస్తున్న గాలి వార్తలపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు. ఇందులో కూడా అసాధారణ నిజాయితీని చూపించాడు. పేర్లతో సహా ప్రకటించి తన ఆలోచనలు మరియు భావాలను దాచడానికి వీలులేకుండా.. ఆయన చెప్పడం చూస్తుంటే ఆయనలో నాకు పర్వత శిఖరం అంత సమగ్రత కనిపించింది.
ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడతానని చెప్పడం చూసి.. నేను ఇప్పుడు ఒక పాఠం నేర్చుకున్నా. ఎందుకంటే నేను ఆలోచించకుండా మాట్లాడటానికి మరియు ట్వీట్ చేయడం అనే ఉద్రేకపూరిత అలవాటు ఉంది. పవన్ ప్రసంగం విన్నాక నాకు కనువిప్పు కలిగింది. అందుకే ఎటువంటి ఆలోచన లేకుండా పవన్ కల్యాణ్‌కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. మొత్తం మీద పవన్ కల్యాణ్ ఒక రకమైన పెద్ద నాయకుడిగా ఉంటాడని నేను భావిస్తున్నాను..’’ అంటూ వర్మ పోస్ట్ చేశారు.