Gossipsసురేష్ బాబు వ్యాఖ్యలతో ఇండ్రస్ట్రీలో కలకలం !

సురేష్ బాబు వ్యాఖ్యలతో ఇండ్రస్ట్రీలో కలకలం !

తెలుగు ఫిల్మ్న్ ఇండ్రస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక మంచి సినిమాకు కలెక్షన్లు ఆశించినంత స్థాయిలో రాకపోవడానికి కారణం అనేకం ఉన్నాయన్నారు. శాటిలైట్ హక్కుల కారణంగా… ప్రేక్షకులకు సినిమా హాల్ కి వచ్చి సినిమా చూడాలనే ఆసక్తి బాగా తగ్గిపోతోంది… సినిమా రిలీజ్ అయిన నెల రోజులకే టీవీల్లో వచ్చేస్తుంటే ఇక ధియేటర్ కి ఎందుకు వస్తారు అంటూ సురేష్ బాబు ప్రశ్నించారు. దీని వల్ల చిన్న సినిమాలు కూడా బాగా నష్టపోతున్నాయన్నారు. ప్రేక్షకుల ఆలోచనా తీరుని బట్టి మనం కూడా కొన్ని కొన్ని మార్పులు చేసుకోవాలని ఆయన చెప్పారు.
అలాగే సినిమా సక్సెస్ మీట్ సంస్కృతి మీద కూడా సురేష్ బాబు ఫైర్ అయ్యారు. సినిమా రిలీజ్ అయిన రెండు మూడు రోజులకే సక్సెస్ మీట్లు పెట్టడం ఈ మధ్య బాగా ఎక్కువయ్యింది. ఇలా ఎలా పెడుతున్నారో అర్ధం కావడం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేసారు. మెంటల్ మదిలో సినిమాకు తలెత్తిన ఇబ్బందులపై సురేష్ బాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇండ్రస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను ఏకరువు పెట్టారు. మెంటల్ మదిలో సినిమా బాగున్నా… అనుకున్న స్థాయిలో మాత్రం కలెక్షన్స్ రావడం లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇదే కాకుండా సినిమా ధియేటర్స్ పర్సెంటేజ్ మీద కూడా ఆయన మాట్లాడారు. చిన్న సినిమాలకు పర్సెంటేజ్ సిస్టమ్ మేలు. కానీ, పెద్ద సినిమాలకు రెంట్ పద్ధతి మేలు చేస్తుంది అని, ఈ విషయం మీద దర్శకరత్న దాసరి నారాయణరావు ఎన్నో సార్లు మాట్లాడారని సురేష్ బాబు గుర్తు చేసారు.

ఒక చిన్న సినిమా ఒక కోటి రూపాయాల బడ్జెట్ తో రూపొందింది కలెక్షన్స్ మాత్రం 4 కోట్లు వస్తే..కోటి రూపాయలు టాక్స్ రూపంలో పోగా మిగిలిన మూడు కోట్లు నిర్మాతకు, ఎక్సిబిటర్ కు పర్సెంటేజ్ పద్ధతిలో డబ్బులు వచ్చే పెరిస్థితి ఉంది. అదే సాధాసీదా సినిమా అయితే… అది 10 కోట్ల బడ్జెట్ తో తీశారు..కలెక్షన్స్ మాత్రం 40 కోట్లు వచ్చాయనుకుంటే.. దానిలో 10 కోట్లు టాక్స్ గా పోయినా మిగిలిన 30 కోట్లలో పర్సెంటేజ్ పద్దతిలో 18 కోట్లు నిర్మాతకు, 12 కోట్లు ఎక్సిభిటర్ కు పోయే అవకాశం ఉంది. ఒకవేళ రెంటల్ పద్ధతి అయితే కేవలం మూడు కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. అంటే 12 కోట్లు కేవలం 3 కోట్లు. ఇదే చిన్న సినిమాలకు వర్తిస్తే వాళ్ళు చాలా నష్టపోతారు. ఇది కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే బాగుంటుంది. ఈ పరిస్థితిపై ఇండస్ట్రీ అంతా కలిసిగట్టుగా మాట్లాడుకుని ఈ విధానం అమలు చేసుకుంటే మంచిదేమో అని సురేష్ బాబు సూచించారు. సురేష్ బాబు సూచనలు బాగున్నాయని, ఈ విధానం అమలు చేస్తే చిన్న నిర్మాతలు బాగుపడతారని పలువురు సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news