ఇటీవల ఇండస్ట్రీలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది నటులు ప్రేమలో పడి లేటు వయసులో కూడా వివాహం చేసుకుంటున్నారు. అయితే అలా లేటు వయసులో వివాహం చేసుకొని సంచలనం క్రియేట్ చేసిన జంటలు ఎవరెవరు ఉన్నారో ? ఓ సారి చూద్దాం.
సంజయ్ దత్ :
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 1987లో మొదటిగా రీచాశర్మని వివాహం చేసుకున్న సంజయ్ దత్ ఒక కుమార్తె పుట్టిన తర్వాత రిచా బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోవడంతో.. ఆ తర్వాత రియా పిళ్లైని పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్ధలు కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత సంజయ్ తన 48 ఏళ్ళ వయసులో మాన్యత దత్ నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
కబీర్ బేడి :
స్టార్ యాక్టర్ కబీర్ బేడీ కూడా తన జీవితంలో నాలుగు వివాహాలు చేసుకున్నాడు. 1969 లో ఫాతిమా బేడిని వివాహం చేసుకున్న ఆయన 1977లో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నాడు. తర్వాత బ్రిటన్ ఫ్యాషన్ డిజైనర్ సుశాంత్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కూడా విడాకులు తీసుకున్న కబీర్ బేడి.. టీవీ రేడియో ప్రొజెక్టర్ నిక్కీ బేడికబీర్ని మూడో వివాహం చేసుకున్నాడు. ఏవో కారణాల చేత వీరిద్దరి మధ్య కూడా విడాకులు జరిగాయి. ఇక చివరిగా 2016లో 70 ఏళ్ల వయసులో తన కన్న 29 ఏళ్లు చిన్నదైనా పర్వీన్ దుసాంజ్ని వివాహం చేసుకున్నాడు కబీర్ బేడి.
నీనా గుప్తా :
స్టార్ యాక్ట్రెస్ నీనాగుప్తా చాలామందికి ఈమె తెలిసే ఉంటుంది. నీనా 1989లో మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వీవీయన్ రిచర్డ్స్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. అప్పటికే రిచర్డ్స్కు పెళ్లయ్యిన సంగతి తెలిసిన నీనా అతడికి దూరమై ఒంటరిగా కూతురిని పెంచింది. అయితే ఆమె 50 సంవత్సరాల లేటు వయసులో చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మహ్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఊర్మిళా మండోత్కర్:
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఊర్మిళా మటోండ్కర్ 2016లో తన 42 ఏళ్ళ వయసులో కాశ్మీర్ కు చెందిన వ్యాపారవేత మొహ్సిన్ అక్తర్ ను ప్రేమించి వివాహం చేసుకుంది.
పవన్ కళ్యాణ్:
టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఏకంగా మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ముందుగా నందినీతో వివాహం జరగిన యేడాదికే విడిపోయారు. తర్వాత రేణుదేశాయ్‌ను పెళ్లాడిన పవన్ ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత రష్యా మోడల్ అయిన తీన్మార్ హీరోయిన్ అన్నా లెజ్నోవాను మూడో వివాహం చేసుకున్నాడు. అప్పటికే పవన్ వయస్సు 40 దాటేసింది.
ఆశిష్ విద్యార్థి :
స్టార్ యాక్టర్ ఆశిష్ విద్యార్థి.. అస్సాం కు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రైనర్ రుపాలీ బారువాతో ప్రేమలో పడి తన 62 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నాడు. అయితే అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఆశిష్ విద్యార్థి పెళ్లి వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.