సినీ రంగంలో అన్నగారు ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం కోసంఎంతో మంది ఎదురు చూసేవారు. అయితే.. కొందరికి కోరకుండానే అవకాశాలు చిక్కితే.. మరికొందరికి మాత్రం ఎంతగా ఎదురు చూసినా.. దక్కేదికాదు. ఇలాంటి వారిలో చంద్రమోహన్ ఒకరు. అన్నగారు మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే చంద్రమోహన్ కూడా దూసుకు పోయేవారు. ఆయన హీరోగా అనేక సినిమాలు వచ్చాయి.
ఒకానొక దశలో సినీ ఇండస్ట్రీ సామాజిక వర్గాల ఆధారంగా విడిపోయినప్పుడు.. చంద్రమోహన్ మంచి ఫామ్ లోకి వచ్చారు. ఆయనతో విశ్వనాథ్ అనేక సినిమాలు చేశారు. ఈ సమయంలో అన్నగారు జోక్యం చేసుకుని.. మళ్లీ అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారు. చిత్రం ఏంటంటే.. అన్నగారిసినిమాలో అవకాశం ఇస్తామని చెబితే.. చంద్రమోహన్ తనకు లభించిన అవకాశాన్ని కూడా వదులుకున్నాడు. అయితే.. అన్నగారి సిని మాల్లో పెద్దగా అవకాశం రాలేదు. వచ్చినా.. ఒకటి రెండు చిన్న చిన్న వేషాలే వచ్చాయి.
దీంతో పట్టుబట్టి.. చంద్రమోహన్ స్వయంగా ఒక సినిమా తీయాలని అనుకున్నారు. అది కూడా అన్నగారు ఎన్టీఆర్ హీరోగా.. ఆయనకు తమ్ముడిగా తాను నటించాలనేది ప్లాన్. అప్పటికి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే చంద్రమోహన్ ఒక కథతో ఆయనను కలిసారు. అయితే.. అన్నగారు రివర్స్‌లో రియాక్ట్ అయ్యారు. పొట్టిగా ఉన్నారని అనుకున్నా.. మీరు గట్టివారే. నాతో సినిమా తీస్తారా? ఇన్నాళ్లు ఏం చేశారు?
అని హాస్యమాడారు.
అప్పుడు తన మనసులోని మాటను అన్నగారితో చెప్పారట చంద్రమోహన్. మీతోకలిసి నటించాలనేది నా యాంబిషన్. ఫుల్ సీన్లు ఎక్కడా లేవు. అందుకే ఈ ప్రయత్నం అన్నారట. దీనికి అన్నగారు ఒకింత ఆశ్చర్య పోయి.. అయితే సరే.. తర్వాత తీసే సినిమాలో మీకు తప్పకుండా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు ఆ హామీ తీరలేదు. కుటుంబ కథా చిత్రాల్లో చంద్రమోహన్ బిజీగా ఉండడంతో.. తర్వాత బాపు తీసిన శ్రీనాథ కవిసార్వభౌమ లో అవకాశం చిక్కించుకోలేక పోయారు.