Moviesసంగీత స‌ర‌స్వ‌తి ' వాణీ జ‌య‌రాం ' పై కూడా ఆ...

సంగీత స‌ర‌స్వ‌తి ‘ వాణీ జ‌య‌రాం ‘ పై కూడా ఆ రూమ‌ర్లు వ‌చ్చాయా…!

సినీమా పాట‌ల్లో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక ముద్ర‌వేసుకున్న గాయ‌కురాలు.. వాణీజ‌య‌రాం. అనేక వంద‌ల సిని మాల్లో ఆమె పాట‌లు అందించారు. ముఖ్యంగా తెలుగులో అయితే విశ్వ‌నాథ్ తీసిన ప్ర‌తి సినిమాలోనూ వాణీ జ‌య‌రాం పాట ఉండాల్సిందే. అయితే.. ఆమెకు ఉన్న ఏకైక ల‌క్ష‌ణం.. కొత్త పాత అనే తేడా లేకుండా అంద‌రితోనూ చొర‌వ‌గా ఉండ‌డం. ఎక్కువ స‌మ‌యంలో స్టూడియోల్లోనే గ‌డిపేవారు.

ఇదే.. అనేక వివాదాల‌కు దారితీసింది. కేవీ మ‌హ‌దేవ‌న్ వంటి సంగీత ద‌ర్శ‌కులు.. ఇంటిక‌న్నా.. స్టూడియో ల్లోనే ఎక్కువ‌గా ఉండేవారు. వారు అనేక సినిమాల‌కు గీతాలు స‌మ‌కూర్చే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యేవారు. ఇలా.. ఒక‌రిద్ద‌రు.. కానీ, ఎం.ఎస్ విశ్వ‌నాథ‌న్ వ‌ర‌కు చాలా మంది సంగీత కారులు.. అలానే ఉండేవారు. అక్క‌డే భోజ‌నాలు.. అక్క‌డే అన్నీ.. అన్న‌ట్టుగా పాట‌ల కూర్పు జ‌రిగేది.

ఇలాంటి ప‌రిస్థితి వాణీ జ‌య‌రాంను ఇబ్బంది పెట్టింద‌ని అంటారు. ఒక త‌మిళ ప‌త్రిక‌లో ఆమె గురించి వ‌చ్చిన చిన్న గ్యాసిప్‌.. అనేక సినిమా అవ‌కాశాల‌కు ఇబ్బందిగా మారింది. కానీ, వాణీ జ‌య‌రాంను అంద‌రూ అప‌ర సంగీత‌ స‌ర‌స్వ‌తిగా భావిస్తారు. దీంతో త‌మిళ‌నాడులో సంగీత క‌ర్త‌లు అంద‌రూ భేటీ అయి.. మీడియా స‌మావేశాలు నిర్వ‌హించ‌రాద‌ని తీర్మానం చేశారు.

అప్పటి వ‌ర‌కు సంగీత ద‌ర్శ‌కులు.. మీడియాతో మాట్లాడే సంప్ర‌దాయం ఉండేది. కానీ, ఎప్పుడైతే.. వాణీ జ‌య‌రాంపై ఇలా లేనిపోనివి రాశారో.. ఆ వెంట‌నే చాలా సీరియ‌స్‌గా డైరెక్ట‌ర్ విశ్వ‌నాథ‌న్ చేసిన తీర్మానం.. ఇప్ప‌టికి అమ‌ల్లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news