Moviesఅభిమానులకి బిగ్ గుడ్ న్యూస్.. చిరంజీవి ఆ పని చేయబోతున్నాడు.. అఫిషియల్...

అభిమానులకి బిగ్ గుడ్ న్యూస్.. చిరంజీవి ఆ పని చేయబోతున్నాడు.. అఫిషియల్ గా ప్రకటించిన చరణ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలాంటి క్రేజ్ తో ఇండస్ట్రీలో సినిమాలు చేసేవాడో.. ఇప్పటికి అలాంటి సినిమాలు చేస్తూ ఎక్కడ మెగా ఫాన్స్ ను డిసప్పాయింట్ చేయకుండా.. సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేస్తూ కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నారు. కాగా ఆయన లాస్ట్ గా నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది . 100 కోట్ల క్లబ్ లోకి చేరి మెగా హీరోస్ స్టామినా ప్రూవ్ చేసింది. ప్రెసెంట్ చిరంజీవి భోలా శంకర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా.. సిస్టర్ రోల్ లో కీర్తి సురేష్ నటిస్తున్నారు . కాగా ఈ సినిమా తప్పిస్తే ఇప్పటివరకు కొత్త సినిమాలు ఏవి ప్రకటించలేదు మెగాస్టార్ చిరంజీవి . ఈ క్రమంలోనే రీసెంట్గా జీ20 సమ్మిట్ లో పాల్గొన్న రామ్ చరణ్ తండ్రి సినిమాలపై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు . మనకు తెలిసింది గ్20 సమ్మిట్ లో పాల్గొని అరుదైన ఘనతను దక్కించుకున్నాడు రామ్ చరణ్ . ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..” ఇండియన్ సినిమా గురించి చెబుతూ ఎన్నో ఏళ్లుగా గొప్ప సంస్కృతి ఆధ్యాత్మికతలతో మలితమైన మన గొప్పతనాన్ని సినీ రంగం తరపున తెలియజేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అంటూ అభిమానులను ఫిదా చేశారు .

ఇలాంటి క్రమంలోనే ఇంతటి స్థాయిలో ఉండడానికి కారణం మా నాన్నగారు అంటూ చిరంజీవిని ఓ రేంజ్ లో పొగిడేసారు. ” ఆయన ఏజ్ 68 అయినా కానీ బాడీని చాలా ఫీట్ గా ఉంచుకుంటారు.. హెవీ వర్కౌట్స్ చేస్తాడు ..క్రమశిక్షణగా ఉంటాడు ..ప్రజెంట్ నాలుగు కొత్త సినిమాలకు సైన్ చేశారు ..త్వరలోనే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి” అంటూ అభిమానులకు క్రేజీ గుడ్ న్యూస్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి భో;ఆ శంకర్ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకోబోతున్నారు అని మనవడి తో ఎంజాయ్ చేసాక ఇండస్ట్రీలో మళ్ళీ సినిమాలు చేస్తాడంటూ వచ్చిన వార్తలు ఫేక్ అంటూ క్లారిటీ వచ్చేసింది. ఏది ఏమైనా సరే ఒకేసారి నాలుగు సినిమాలకి సైన్ చేసి నాలుగు సినిమాల ను సెట్స్ పైకి తీసుకోరావడం మెగాస్టార్ చిరంజీవికి కొత్త విషయం ఏమీ కాదు . గతంలో ఎన్నోసార్లు అలా చేసి మెగా అభిమానులను మెప్పించాడు మెగాస్టార్ చిరంజీవి. చూద్దాం మరి ఆ డైరెక్టర్స్ ఎవరో..? ఎలాంటి క్రేజీ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటాడో చిరంజీవి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news