Moviesఆ హీరోయిన్ల‌పై మనసు పారేసుకున్న టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లు... అంత మోజా...!

ఆ హీరోయిన్ల‌పై మనసు పారేసుకున్న టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లు… అంత మోజా…!

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే కొంతమంది హీరో హీరోయిన్లకి మంచి అవినాభావ సంబంధం ఉంటే.. అదే సమయంలో కొంతమంది దర్శకులకు మరికొంతమంది హీరోయిన్లకు కూడా మంచి అనుబంధం ఏర్పడి ఉంటుంది. ప్రత్యేకించి కొంతమంది హీరోయిన్లు కొంతమంది దర్శకులకు మాత్రమే కనెక్ట్ అవుతూ ఉంటారు.. ఇందులో నానా అర్థాలు తీయడానికి ఆస్కారం లేదు.

కానీ ఒకసారి ఆ డైరెక్టర్ తో హిట్ కొట్టిన హీరోయిన్లు లేదా ఆ హీరోయిన్ తో హిట్టు కొట్టిన డైరెక్టర్లు వారిని చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు అలా మళ్లీ మళ్లీ ఆ కాంబినేషన్లోనే సినిమాలు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రత్యేకించి కొంతమంది దర్శకులపై కొంతమంది హీరోయిన్లు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పాలి. ఇక వారెవరో ఇప్పుడు చూద్దాం..

పూరీ జగన్నాథ్ – ఛార్మీ కౌర్ :
జ్యోతిలక్ష్మి సినిమా కోసం చార్మిని హీరోయిన్గా తీసుకున్నారు పూరి జగన్నాథ్. అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్. అయితే జ్యోతిలక్ష్మి సినిమాతో మొదలైన వీరి పరిచయం ఇప్పటికీ కాంబినేషన్ కొనసాగుతూనే ఉంది. పూరీ కనెక్ట్స్ పేరుతో వీరిద్దరూ కలిసి ఒక నిర్మాణ సంస్థను కూడా రన్ చేస్తున్నారు. అస‌లు ఇప్పుడు ఛార్మీ లేనిదే పూరి సినిమాలు తీయ‌ట్లేదు.

త్రివిక్రమ్ – పూజా హెగ్డే:
అరవింద సమేత చిత్రం నుంచి వీరిద్దరి కాంబినేషన్ మొదలయ్యింది. ఆ తర్వాత అలవైకుంఠపురం లో కూడా పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఎస్ ఎస్ ఎం బి 28 లో కూడా ఈమె అవకాశం దక్కించుకుంది. అస‌లు పూజా లేనిదే త్రివిక్ర‌మ్ సినిమాలు చేయ‌లేడ‌న్నంత టాక్ వ‌చ్చేసింది.

త్రివిక్ర‌మ్ – స‌మంత‌:
ఇక త్రివిక్ర‌మ్ గ‌తంలో త‌న సినిమాల్లో వ‌రుస‌గా ఇలియానాను ఆ త‌ర్వాత స‌మంత‌ను వ‌రుస‌గా రిపీట్ చేశారు. జులాయి, జ‌ల్సాలో ఇలియానా ఆ త‌ర్వాత అత్తారింటికి దారేది, ఆ..ఆ, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాల్లో స‌మంత‌ను వ‌రుస‌గా తీసుకున్నారు. దీంతో వారిద్ద‌రి కాంబినేష‌న్‌పై చాలా పుకార్లు వ‌చ్చాయి.

ఇక వీరితోపాటు వెంకీ కుడుముల – రష్మిక మందన్న, సాయి పల్లవి – శేఖర్ కమ్ముల, సంపత్ నంది – తమన్నా , అనిల్ రావిపూడి – మెహరీన్ , కాజల్ అగర్వాల్ – తేజ ఇలాంటి కాంబినేషన్లకి ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా డిమాండ్ పెరిగిందని చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news