MoviesTL రివ్యూ : అన్నీ మంచి శకునములే... అంత మంచి శ‌కున‌మా...

TL రివ్యూ : అన్నీ మంచి శకునములే… అంత మంచి శ‌కున‌మా ఇది..!

టైటిల్‌: అన్నీ మంచి శకునములే
నటీనటులు : సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్ తదితరులు
మాటలు : లక్ష్మీ భూపాల
సినిమాటోగ్ర‌ఫీ : సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్
మ్యూజిక్‌ : మిక్కీ జె. మేయర్
నిర్మాణ సంస్థలు : స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్
నిర్మాత : ప్రియాంకా దత్
దర్శకత్వం : బీవీ నందినీ రెడ్డి
రిలీజ్ డేట్‌: మే 18, 2023

యంగ్ హీరో సంతోష్ శోభన్ – నందినీ రెడ్డి కాంబినేష‌న్లో తెర‌కెక్కిన సినిమా అన్నీ మంచి శకునములే . టీజ‌ర్లు, ప్రోమోలు, ట్రైల‌ర్ల‌తో ఆస‌క్తి రేపిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ సినిమా అంచ‌నాలు అందుకుందో లేదో చూద్దాం.

స్టోరీ :
ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) – దివాకర్ (రావు రమేశ్), సుధాకర్ (సీనియర్ నరేష్) కుటుంబాల మధ్య ఓ కాఫీ ఎస్టేట్ గురించి కోర్టు కేసులు ఉంటాయి. ఇక వీరిలో రిషి (సంతోష్ శోభన్) సుధాకర్ కొడుకు, ఆర్య (మాళవికా నాయర్) ప్రసాద్ కుమార్తె. వీరు ఇద్ద‌రూ ఒకే రోజు పుడ‌తారు. అయితే ఆస్ప‌త్రిలో న‌ర్సుల మిస్ అండ‌ర్ స్టాండింగ్‌తో ఈ పిల్ల‌లు మారిపోతారు. ప్రసాద్ ఇంట్లో, ఆయన కొడుకుగా రిషి… సుధాకర్ ఇంట్లో, ఆయన కుమార్తెగా ఆర్య పెరుగుతారు. మ‌రి వీరి తల్లిదండ్రుల‌కు పిల్ల‌లు మారిన విష‌యం తెలిసిందా… వీరిద్ద‌రి ప్రేమ ఏమైంది ? ఈ కోర్టు గొడ‌వ‌లు ఏమ‌య్యాయి ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ :
ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది. అయితే సినిమా స్టార్ట్ అయిన కొద్ది సేప‌ట‌కే మ‌నం గ‌తంలో చూసిన సినిమాలు మ‌న క‌ళ్ల ముందు మెదులుతూ ఉంటాయి. ఆసుప‌త్రిలో పిల్ల‌లు మార‌డం అనేది అల వైకుంఠ‌పురంలో సినిమాను గుర్తు చేస్తుంది. కామెడీ ట‌చ్చింగ్ బాగా కుదరడంతో ఫస్టాఫ్ పాస్ అయిపోతుంది. సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక క్లైమాక్స్ వ‌ర‌కు మ‌ధ్య‌లో వ‌చ్చే సీన్లు రొటీన్‌గా మ‌న స‌హ‌నం ప‌రీక్షిస్తాయి. క్లైమాక్స్‌లో మాత్రం ఎమోష‌న‌ల్ సీన్లు హార్ట్ ట‌చ్చింగ్‌గా ఉంటాయి.

హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాల్లో ఆ ఫీల్ లేదు. పెళ్లిలో కుటుంబ స‌భ్యులు అంద‌రూ డ్యాన్సులు చేసే సీన్లు ఇప్ప‌ట‌కి అయినా ఆపేస్తే బాగుంటుంది. ఇక సినిమాలో క్యారెక్ట‌రైజేష‌న్లను ఎలివేట్ చేసేందుకు నందినీరెడ్డి టీం బాగా వ‌ర్క్ చేసిన‌ట్టుగా ఉంది. సినిమాటోగ్ర‌ఫీ బావుంది. మిక్కీ జె మేయర్ సంగీతంలో గుర్తుంచుకునేలా సాంగ్స్ లేవు. ఆర్ ఆర్ కొన్ని సీన్ల‌లో బాగుంది. నిర్మాణ విలువల్లో స్వప్నా దత్, ప్రియాంకా దత్ ఎక్కడా రాజీ పడలేదు.

న‌టీన‌టుల్లో క్లైమాక్స్‌తో పాటు ఎమోష‌న‌ల్ సీన్ల‌లో బాగా చేశాడు. లుక్స్ పరంగా మాళవికా నాయర్ కొత్తగా ఉన్నారు. తల్లి పాత్రలో గౌతమిని చూడటం కొంచెం రెఫ్రెషింగ్ గా ఉండ‌గా… మిగిలిన న‌టులు అంద‌రూ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక హీరో సిస్ట‌ర్‌గా తొలిప్రేమ ఫేమ్ వాసుకి బాగుంది. ఆమెకు స్టార్ హీరోల‌కు సిస్ట‌ర్స్ రోల్స్ ఆఫ‌ర్లు కంటిన్యూ కావ‌చ్చు. వాసుకి భర్తగా ‘వెన్నెల’ కిశోర్ కొన్ని సీన్లలో త‌ళుక్కుమ‌న్నాడు.

ఫైన‌ల్‌గా…
అన్నీ మంచిశ‌కున‌ములే క‌థ‌గా కంటే పార్టు పార్టులుగా మెప్పిస్తుందంతే.. అంత‌కు మించిన శ‌కున‌ములు లేవు.

అన్నీ మంచి శకునములే రేటింగ్‌: 2 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news