అక్కినేని నాగేశ్వరావు గారి మనవడు హీరో సుమంత్ కీ నాగార్జున కీ మధ్యన ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి అనే వార్త ఇప్పుడు వైరల్ అయ్యింది. వీరిద్దరికీ మధ్య ఆస్తుల పంపకం విషయం లో తేడా రావడంతో వీరి మధ్య పతాక స్థాయిలో విభేదాలు వచ్చినట్టు సమాచారం. ఒకప్పటి లాగా సుమంత్ బాగోగులు చూడడం దగ్గర నుంచీ ఏ విషయం లోనూ నాగార్జున పట్టించుకోవడం లేదని వార్తలు షికార్లు చేస్తున్నాయి.
అక్కినేని నాగేశ్వరరావు చనిపోయాక ఉమ్మడి ఆస్తుల పంపకం దగ్గర అక్కినేని ఫ్యామిలిలో విభేదాలు వచ్చాయని రకరకాల రూమర్లు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై అటు నాగార్జున కానీ.. అటు సుమంత్ కానీ ఎప్పుడూ ఈ రూమర్ల గురించి స్పందించింది లేదు. తాజాగా ‘మళ్ళీ రావా’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక వీడియో ఇంటర్వ్యూలో సుమంత్ స్పందించాడు.
`గతంలో మావయ్యని రోజూ కలిసి మాట్లాడేవాడిని. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆయణ్ని కలవడం తగ్గింది. అంతే తప్ప మా మధ్య విభేదాలు లేవు. అసలు బయట ఇలాంటి ప్రచారమొకటి జరుగుతోందని కూడా నాకు తెలియదు. ఆయనతో రోజూ ఫోన్‌లో మాట్లాడుతుంటా. అఖిల్, చైతూ, రానా.. ఇలా మా కుటుంబ హీరోలందరితో నాకు మంచి అనుబంధముంది. వారితో కలిసి నటించడానికి నేను సిద్ధమ`ని సుమంత్ దీనిపై క్లారిటీ ఇస్తున్నాడు.