Gossipsఏంటి నాగ్ - బాలయ్య కలిసి నటిస్తున్నారా ..? నిజమేనా ..?

ఏంటి నాగ్ – బాలయ్య కలిసి నటిస్తున్నారా ..? నిజమేనా ..?

బాలయ్య .. నాగ్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విబేధాలు ఉన్నాయని ప్రచారం ఇప్పటివరకు ఊపందుకుంది. అయితే ఇప్పుడు ఆ ప్రచారం అంతా ఉత్తుత్తిదే అని నమ్మే పరిస్థితులు మనకు కనిపించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది అనే వార్త ఇప్పుడు అందరి నోళ్లు వెళ్ళబెట్టేలా చేస్తోంది. ఒకరేమో వెండితెర మన్మధుడు మరొకరేమో వెండితెర మీద నట సింహం. వీరి ఇద్దరి కాంబినేషన్ ఊహించుకుంటేనే ఇరువురి హీరోలకి మంచి కిక్కు వచ్చేస్తుంది.

బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్లో ఓ పౌరాణిక చిత్రం చేసేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. తాజా ఈ ప్రాజెక్టు గురించి ఇండస్ట్రీలో మళ్లీ హాట్ టాపిక్ అయింది. బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్లో ‘నరనారాయణ’ అనే పౌరాణిక చిత్రం చేసేందుకు నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన స్క్రిప్టు కూడా రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

నవావధాని మీగడ రామలింగస్వామి ‘నరనారాయణ’ సినిమా కోసం స్కిప్టు సిద్ధం చేశారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ…. నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య కోరికపై నాగార్జున, బాలకృష్ణ కోసం ఈ స్క్రిప్టు రాశానని, ఇద్దరి సంభాషణల కోసం ఎన్నో సమాసాలను వాడామని, ఇటీవలే అది పూర్తయిందని తెలిపారు.

అయితే ఇప్పటివరకు ఈ సినిమా పై స్ప్రష్టమైన క్లారిటీ అయితే మాత్రం రాలేదు. ప్రస్తుతం బాలయ్య నాగార్జున మధ్య విభేదాలు తొలిగిపోయాయా..? ఈ సినిమా తొందర్లోనే వెండి తెర మీద కనిపించబోతోందా అనే సందేహాలు మాత్రం వీడలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news