పాపం .. కృతి శెట్టి తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు .. కానీ ఆమె సెలెక్ట్ చేసుకున్న సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిపోతున్నాయి . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కృతి శెట్టి సైన్ చేసిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా బోల్తా కొట్టాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ క్రమంలోనే రీసెంట్గా కృటి శెట్టి హీరోయిన్గా నటించిన “కస్టడి” సినిమా సైతం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
దీంతో ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . అయితే కృతి శెట్టి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన మాటలను ఇప్పుడు సమంత ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు . కృతిశెట్టి “కస్టడి” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ నుంచి ఏదురైన ప్రశ్నకు టపి టపి మంటూ ఘాటుగా సమంతకు ఇన్ డైరెక్ట్ గా తగిలే విధంగా ఆన్సర్ ఇచ్చింది . “మీకు ఒకవేళ ఉ అంటావా మావ”..లాంటి సాంగ్ ఆఫర్స్ వస్తే చేస్తారా..? అంటూ అడిగేశారు.
ఈ ప్రశ్నకి సెకండ్ కూడా ఆలోచించుకోకుండా కృతి శెట్టి చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది. ” ఇప్పటివరకు ఉన్న నా మైండ్ సెట్ ప్రకారం కచ్చితంగా అలాంటి ఆఫర్ వస్తే ఎన్ని కోట్లు ఇచ్చినా చేయను.. ఫ్యూచర్లో కూడా అలాంటివి చేస్తానన్న ఆలోచనలు నమ్మకాలు నాకు లేవు. నేనైతే మాత్రం అలాంటి సాంగ్ లో నటించను ” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే పరోక్షంగా కృతి శెట్టి – సమంతకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. అయితే కస్టడి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఇదే కామెంట్స్ ను ట్రెండ్ చేస్తున్నారు సమంత ఫ్యాన్స్ . నటి అన్నాక ఎలాంటి రోల్స్ నైనా నటించాలి ..అప్పుడే హీరోయిన్గా ఎదుగుతారు.. నీలాగా ఒకే రోల్ లో పట్టుకుని కూర్చుంటే ఇలాగే ప్లాప్ అవుతారు అంటూ ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు..!!