Movies"17 ఏళ్ల వయసులోనే అలాంటి పని.. నా భర్త ఆ విషయంలో...

“17 ఏళ్ల వయసులోనే అలాంటి పని.. నా భర్త ఆ విషయంలో కేక”.. ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్స్ వైరల్..!

ప్రియాంక చోప్రా హాలీవుడ్ ని ఏ రేంజ్ లో తన అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పెళ్లి చేసుకున్న తర్వాత బాలీవుడ్ కన్నా హాలీవుడ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న ప్రియాంక చోప్రా .. రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫ్యామిలీ పర్సనల్ విషయాలు సైతం ఓపెన్ గా చెప్పుకొస్తుంది . ఈ క్రమంలోనే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన భర్తకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ని బయట పెట్టింది.

ప్రియాంక- నిక్ జోనస్ లకు మధ్య పదేళ్ల గ్యాప్ ఉంది అన్న సంగతి మనకు తెలిసిందే. అంటే నిక్ కి ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ప్రియాంకకు 17 ఏళ్ల వయసు ఉందన్నమాట . ప్రియాంక చోప్రా 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే మిస్ వరల్డ్ పోటీలకు వెళ్లి కిరీటాన్ని అందుకుంది . ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నేను 17 ఏళ్ల వయసులో మిస్ వరల్డ్ క్రోన్ అందుకుంటున్నప్పుడు నా భర్త టీవీ లో నన్ను కల్లప్పగించి అలాగే చూశారట. ప్రోగ్రాం మిస్ అవ్వకుండా చూస్తూ అట్లాగే ఉండిపోయాడట . ఈ విషయం రీసెంట్ గా మా అత్తగారు నాకు చెప్పుకొచ్చారు.”

” అప్పుడే ఆ దేవుడు మా బంధం కలిపినట్లు ఉన్నారు. నేను మిస్ వరల్డ్ గెలిచి దాదాపు 22 ఏళ్ళు అవుతుంది మిస్ వరల్డ్ పోటీల్లో విజేతైన క్షణాన్ని టీవీలో చూసి తెగ ఎంజాయ్ చేసాడట . టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో నా భర్త నిక్ జోనస్ కేక.. మా అత్తగారు నాకు చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది : అంటూ తన భర్త చేసిన పనిని ఓపెన్ గా చెప్పుకొచ్చింది ప్రియాంక .అంతేకాదు నిక్-ప్రియాంక ఇద్దరు పెళ్లి కి ముందే డేటింగ్ చేశామని పెళ్లి తర్వాత నీజాయితిగా తమ రిలేషన్ లో కంటిన్యూ చేస్తున్నామని చెప్పుకొచ్చింది ప్రియాంక..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news