గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. తొలిరోజే యునానమస్‌గా పెద్ద ప్లాప్. ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు పెద్ద ఆక్యుపెన్సీ అయితే లేదు. అసలు మ్యాటర్ అది కాదు… గోపీచంద్ సినిమా వస్తుందంటే చాలు ఓ సెక్షన్ ఆడియన్స్ తొలి రోజే సినిమా చూడాలన్న ఆశతో వెయిట్ చేస్తూ ఉంటారు. గోపీచంద్ నుంచి మాస్ సినిమా ఆశిస్తారు. కనీసం అలాంటి జనం కూడా రామబాణం సినిమాకు తొలి రోజు రాలేదు. లెక్కలు చూస్తుంటూనే ఈ నిజాలు బయట పడుతున్నాయి.
అసలు గోపీచంద్ సినిమాకు రిజల్ట్‌తో సంబంధం లేకుండా మినిమం ఓపెనింగ్స్ పడతాయి. గత ఆరేళ్లలో గోపీచంద్ సినిమాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ చూస్తే మనోడికి కొంతమంది అభిమానులు ఉన్నారని.. వాళ్లు గోపీ సినిమాను ఫస్ట్ డే చూసేందుకు వస్తున్నారని అర్థమైంది. అయితే రామబాణంకు మొదటి రోజు కోటి రూపాయల కంటే కాస్త ఎక్కువగా మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో షేర్ తేలింది.
ఐదేళ్లలో చాణక్య సినిమా మాత్రమే గోపీ కెరీర్లో లిస్ట్ ఓపెనర్ సినిమాగా చెత్త రికార్డు మూటకట్టుకుంది. ఆ సినిమా టైంలోనే చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమా కూడా వచ్చింది. ఇక చాణక్య తర్వాత ఇప్పుడు అతి తక్కువ ఓపెనింగ్స్ వచ్చిన చెత్త సినిమాగా రామబాణం రికార్డుల్లోకి ఎక్కింది. గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్, సీటీమార్, గౌతమ్ నంద, పంతం సినిమాలన్నీ మొదటి రోజు రెండున్నర కోట్లకు పైగానే షేర్ రాబట్టాయి.
ఇక రామబాణం సినిమాకు ఎంత ప్రచారం చేసినా.. ఎంత బడ్జెట్ పెట్టినా.. ఎంత హడావిడి ఉన్నా కూడా ఓపెనింగ్స్ రాలేదు. ఎంత హడావిడి చేసినా కథలో దమ్ములేకపోతే ఏం జరుగుతుందో రామబాణం మరోసారి ఫ్రూవ్ చేసింది. తాజా వసూళ్లతో గోపీచంద్ కనీసం ఓపెనింగ్స్ కూడా కోల్పోతున్నాడని క్లారిటీ వచ్చేసింది. గోపీ కథల విషయంలో కాన్సంట్రేషన్ చేయకపోతే మనోడి కెరీర్ డేంజర్ జోన్లోకి వెళ్లిపోనుంది.