నిన్న శుక్రవారం టాలీవుడ్లో ఇద్దరు మిడిల్ రేంజ్ హీరోలు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అల్లరి నరేష్ నటించిన ఉగ్రం, గోపీచంద్ రామబాణం సినిమాలు వచ్చాయి. పైగా ఈ రెండు సినిమాల డైరెక్టర్లు గతంలో హిట్ కాంబినేషన్లు చేసినవారే. నరేష్ నాంది సినిమా డైరెక్టర్ విజయ్. గోపీచంద్‌తో లక్ష్యం, లౌక్యం తీసిన శ్రీవాస్ రామబాణం డైరెక్టర్. దీంతో ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక తొలి రోజే గోపీచంద్ రామబాణం సినిమాకు బిగ్ మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే మిక్స్ డ్ టాక్ అనడం కంటే ప్లాప్ టాకే ఎక్కువుగా బయటకు వచ్చింది. ఉగ్రం సినిమాకు ఎబో యావరేజ్, హిట్ టాక్ వచ్చేసింది. రామబాణం పరమ రొటీన్ సినిమాయే అని ఎక్కువ మంది తేల్చేశారు. ఉగ్రంలో సరికొత్త నరేష్‌ను చూడడంతో పాటు కథ కూడా కొత్తగా ఉందనే చెప్పారు.
ఇక ఉగ్రంకు ఫస్ట్ డే అన్ని ప్రాంతాలు కలిపి 1.30 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకు రు. 6 కోట్ల రేంజ్లో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్లోనే రు. 4 కోట్ల షేర్ వస్తుందని లెక్కులేస్తున్నారు. ఇక నైజాంలో ఈ సినిమాకు రు. 44 లక్షలు వసూళ్లు వచ్చాయి. ఇక రామబాణంకు నైజాంలో రు. 85 లక్షలు వచ్చాయి.
ఇక రామబాణంకు వరల్డ్ వైడ్‌గా రు. 15 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగితే ఫస్ట్ డే రు 1.5 కోట్లకు కాస్త అటూ ఇటూగా వసూళ్లు వచ్చాయి. రామబాణం రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్‌లే లేవు. అటు ఉగ్రం రెండో రోజు నుంచి భారీగా పుంజుకోనుంది. ఏదేమైనా ఈ ఇద్దరు హీరోల పోటీలో నరేష్ ఫస్ట్ డేకే గోపీచంద్‌పై స్పష్టంగా పై చేయి సాధించినట్టు క్లీయర్‌గా తెలుస్తోంది.