Newsవాళ్ళు రాకేష్ కాపురంలో నిప్పులు పోస్తున్నారా..? విడదీయాలని చూస్తున్నారా..? .. సంచలన...

వాళ్ళు రాకేష్ కాపురంలో నిప్పులు పోస్తున్నారా..? విడదీయాలని చూస్తున్నారా..? .. సంచలన విషయం బయటపెట్టిన జోర్దార్ సుజాత ..!

బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్నక‌మెడియ‌న్ల‌లో రాకింగ్ రాకేష్ ఒక‌రు. రాకేష్ బిగ్‌బాస్, జ‌బ‌ర్ద‌స్త్ షోలోకి ఎంట‌ర్ కావ‌డానికి చాలా యేళ్ల పాటు సినిమాల్లో అవ‌కాశాల కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. అక్క‌డ అల‌సిపోయాక మిమిక్రీ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. రాకేష్ చేసే మిమిక్రీ తెలుగు బుల్లితెర‌పై ఎంతోమందిని మ‌నోడికి ఫ్యాన్స్‌ను చేసింది.

ఆ త‌ర్వాత చాలా ఈవెంట్స్‌లో కామెడీ స్కిట్స్ చేస్తూ బాగా పాపుల‌ర్ అయ్యాడు. ఇక జ‌బ‌ర్ద‌స్త్‌లోకి ఎప్పుడు అయితే ఎంట‌ర్ అయ్యాడో మ‌నోడి లైఫ్‌స్టైల్ మారిపోయింది. అక్క‌డ ప‌రిచ‌యం అయిన జోర్దార్ సుజాత‌, రాకేష్ ఇద్ద‌రూ డీప్‌ల‌వ్‌లో ప‌డిపోయారు. కొద్ది నెల‌ల క్రిత‌మే ఈ జంట వివాహ బంధంతో ఒక్క‌టి అయ్యింది. రీసెంట్ గా సుజాత న‌టించిన సేవ్ ది టైగ‌ర్ సీరిస్‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.

ఈ క్ర‌మంలోనే సుజాత త‌న ల‌వ్‌స్టోరీ, కెరీర్ గురించి కొన్ని సంచ‌ల‌న విష‌యాలు పంచుకుంది. త‌మ పెళ్లి ఇంత త్వ‌ర‌గా అయిపోవ‌డానికి కార‌ణం రోజా గారే అని చెప్పింది. త‌మ ప్రేమ‌ను రోజా గారే ముందుగా క‌నిపెట్టేశార‌ని… తాము ప్రేమించుకుంటోన్న టైంలో ఇద్ద‌రి మ‌ధ్య చెప్పుడు మాట‌లు చెపుతూ కొంద‌రు త‌మ‌ను విడ‌దీసేందుకు ప్ర‌య‌త్నించారంటూ సుజాత వాపోయింది.

ఒక‌రిపై ఒక‌రికి మాట‌లు చెపుతూ ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెంచాలని చాలా మంది చూశారని కూడా ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇక రాకేష్ త‌న జీవితంలో ఎంతో ల‌క్కీ ప‌ర్స‌న్ అని.. అత‌డు నా లైఫ్‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచ‌చే నాకు ల‌క్ మొద‌లైంద‌ని సంతోషంగా చెప్పింది. ఇక తాము ఇద్ద‌రం ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు ముందుగా ఎవ‌రం ప్ర‌పోజ్ చేసుకున్నామో తెలియ‌నంత ప్రేమలో ప‌డిపోయామ‌ని చెప్పింది.

తాము ముందు నుంచి మంచి స్నేహితులం అని… రాకేష్ కి పెళ్లి మీద ఇంట్రస్ట్ లేకపోతే పెళ్లి చేసుకో ఒంటరిగా ఉండలేవు ఒక ఏజ్ వచ్చాక అంటూ ఒక స్నేహితురాలిగా ఎన్నోసార్లు స‌ల‌హా ఇచ్చానంటూ సుజాత చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news