మహానటి భానుమతి అంటే..ఫైర్ బ్రాండ్. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆమె ఒక్క నటి మాత్రమే కాదు.. అగ్ర దర్శకురాలు.. అగ్రగాయకురాలు.. తన సినిమాల్లో ఖచ్చితంగా ఒక పాటైనా ఉండాలని పట్టుబట్టేవారు. లేదంటే సినిమానే వద్దనే టైపు. దీంతో సందర్భం కల్పించి అయినా.. పాట పెట్టిన సినిమాలు ఉన్నాయి. ఇక, అగ్ర నిర్మాత కూడా. భరణి పిక్చర్స్ సంస్థను ఏర్పాటు చేసిన విలువతో కూడిన సినిమాల తీశారు.
అయితే.. ఇక, కొత్త ప్రవాహం వచ్చేసి.. పాత నీటిని కొట్టేసిన తర్వాత అనేక మంది పాతతరం నటులు కను మరుగు.. తెరమరుగు అయిపోయారు. ఇలాంటి సందర్భంలోనే కోడి రామకృష్ణ.. భానుమతిని సంప్రదించి తాము తీయబోయే మంగమ్మగారి మనవడు సినిమా కథను వివరించారు. వాస్తవానికి ముందు జమునను అనుకున్నారట. కానీ, ఆమె చేయనని చెప్పేసరికి(బామ్మగా నటించాలంటే.. వయసు అడ్డం వచ్చింది) భానుమతిని అనుకున్నారు.
ఓకే అయిపోయింది. అయితే.. కథ వరకు బాగానే ఉన్నా.. డైలాగుల విషయానికివస్తే.. అప్పుడప్పుడే.. తెలుగు ఇండస్ట్రీ మాస్ వైపు మళ్లుతున్న పరిస్థితి. ద్వంద్వార్థాలు.. బూతు పదాలు కూడా ఎక్కువగా వస్తున్న సమయం అది. పైగా ..మంగమ్మగారి మనవడు సినిమా పక్కా పల్లెటూరి వాతావరణంలో తీసే సినిమా. దీంతో ఈ సినిమాలోనూమాస్‌ను ఆకట్టుకునేందుకు బూతు పదాలు, ద్వంద్వార్థ పదాలు ఉండాలని దర్శకుడు నిర్ణయించుకున్నాడు.
మరి ఈ విషయం చెప్పాలంటే.. భయం. దీంతో ఏమీ చెప్పకుండానే భానుమతి పార్ట్ డైలాగులు రాసి ఇచ్చేశారు. అంతే.. వాటిని చదివిన ఆమె ఫైరయ్యారు. ఇదా.. మీరు తీసే సినిమా!ఇంతకన్నా మంచి డైలాగులు లేవా? అంటూ క్లాస్ పీకారు. దీంతో కోడి రామకృష్ణ ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఇక, భానుమతి విజృంభించారు.
తన పాత్రకు సంబంధించి బూతు డైలాగులు తీసేసి.. తనే సామెతలు, జాతీయాలతో మాస్‌ను ఆకట్టుకునేలా డైలాగులు రాసుకున్నారు. ఇందులో .. ప్రతి డైలాగులోనూ.. భానుమతి సామెతలు కుమ్మరించడం.. విశేషం. అయితే.. అవన్నీ బూతు డైలాగులేనని.. అమ్మ మార్చుకున్నారని కోడి ఓ సందర్భంలో చెప్పారు.