ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో శోభిత ధూళిపాళ్ల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అమ్మడు సినిమాల గురించి ఏమో కానీ నాగచైతన్యతో రిలేషన్ షిప్ లో ఉందని మాత్రం సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ అన్ని ఇండస్ట్రీలో నాగచైతన్య శోభిత ధూళిపాళ్ళ పేరులు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి.
కాగా ఇదే టైంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న శోభిత ధూళిపాళ్లకు నాగచైతన్యతో రిలేషన్ పై పలుసార్లు ప్రశ్నలు ఎదురవుతున్నాయి . అయితే వాటిపై ఏమాత్రం స్పందించిన శోభిత ధూళిపాళ్ల .. ఆ ప్రశ్నలను సైలెంట్ గా స్కిప్ చేస్తుంది . అయితే నాగచైతన్యతో నిజంగా ఎలాంటి రిలేషన్షిప్ లో లేకపోతే ఎందుకు ఆమె ఆ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడం లేదనేది అభిమానుల క్వశ్చన్ మార్క్ ..?
నిజంగా ఒకవేళ మీ మధ్య ఏమీ లేకపోతే ..ఆన్సర్ ఇవ్వచ్చు కదా . ఒకవేళ ఉన్నా కూడా చెప్పొచ్చు కదా.. ఇలా ఎందుకు తెలిసి తెలియని దోబూచులాటతో నాగచైతన్యతో ఎఫైర్ గురించి సిల్లీగా డబల్ గేమ్స్ ఆడుతుంది..అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు కేవలం పబ్లిసిటీ పాపులారిటీ కోసమైతే అలాంటి పిచ్చి పనులు మానుకోమంటూ సజెషన్స్ ఇస్తున్నారు . ఈ క్రమంలోని శోభిత ధూళిపాల ఎందుకు నాగచైతన్య విషయంలో ఫుల్ కమిట్మెంట్ ఇవ్వలేక పోతుంది అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదలుతుంది. దీనిపై శోభిత నాగచైతన్య ఆన్సర్ ఇస్తేనే బాగుంటుంది అంటూ సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు..!!