సినీ రంగంలో తమ రచనా సామర్థ్యంతో ఓ వెలుగు వెలిగిన బ్రదర్స్ పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూ రి గోపాల కృష్ణ. 80లలో వారి దూకుడు అంతా ఇంతా కాదు.. సినీ రైటర్స్‌గా తెలుగునాట ఒకప్పుడు.. సీని యర్ సముద్రాల, ఆయన కుమారుడు జూనియర్ సముద్రాల ఎంతో ప్రఖ్యాతి గడించారు. దాదాపు 300 సినిమాలకు వారు కథలు.. మాటలు అందించారు. ఆ తర్వాత.. మళ్లీ ఆ రేంజ్‌లో ఎవరూ ఇంత రికార్డు సాధించలేదు.
అయితే..పరుచూరి బ్రదర్స్ మాత్రం ఈ ఘనత సాధించారు. 350 సినిమాలకు వారు కథలు రాశారు. వీటి లో కీలకమైన జస్టిస్ చౌదరి వంటివి ఉన్నాయి. అయితే.. వీరిలో పరుచూరి గోపాల కృష్ణ తర్వాత తర్వాత.. నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన వెనుక వెంకటేశ్వరరావుకూడా తెరమీదకి వచ్చారు. ఈ క్రమంలోనే పరుచూరి గోపాల కృష్ణ ఒక సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అదే 1985లో వచ్చిన భలే తమ్ముడు.
దీనిలో నందమూరి బాలకృష్ణ నటించాడు. అయితే.. ఈ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ హర్టయ్యారు. ఈ విషయం తెలిసిన.. అన్నగారు పరుచూరి బ్రదర్స్‌ను ఇంటికి పిలిచి.. మీకు దర్శకత్వం ఎందుకు ? నా మాట విని మాటలు రాసుకోండి చాలు. వాటిని మీరు బాగా రాస్తున్నారు. అని సలహా ఇచ్చారు.దీంతో హర్టయిన పరుచూరి బ్రదర్స్.. అన్నగారు ప్రోత్సహిస్తారని అనుకుంటే.. ఇలా చేశారేంటా? అని ఆవేదన వ్యక్తం చేశారు.
తర్వాత కాస్త లైట్‌గా గ్యాప్ కూడా వచ్చింది. తర్వాత పట్టుదలతో వ్యవహరించి.. 1991లో శోభన్‌బాబు హీరోగా సర్పయాగం సినిమా తీశారు. ఇది బాగా హిట్టయింది. అయితే.. దీనికి అన్నగారి నుంచి ప్రశంసలు రాలేదు కానీ.. ఇండస్ట్రీలో బెస్ట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత.. కొన్ని సినిమాలు తీసినా.. ప్రేక్షకుల అభిరుచి మారడంతో పరుచూరు బ్రదర్స్ దర్శకత్వం నుంచి వెనక్కి తగ్గారు.