సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం…అయితే ఎన్ని రంగులు ఉన్నా సినిమావాళ్ల జీవితాల్లో మాత్రం ఆ రంగులు ఉండవని ఓ టాక్ కూడా ఉంది. ఆ రంగగులన్నీ తెరపైన మాత్రమేనని చాలామంది జీవితాలు చీకటిమయమేనననే టాక్ ఉంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లు నటీమణులు ఎక్కువగా వేధింపులకు గురవుతారనే మాట ఇప్పటి వరకూ చాలా మంది నోటి వెంట వచ్చిన సంగతి తెలిసిందే.
పలువురు హీరోయిన్ లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు తామకు కాస్టింగ్ కౌచ్ ను ఎదురుకున్నామంటూ మీడియా ముందు చెప్పిన సంధర్బాలు ఉన్నాయి. అయితే చాలా ఏళ్ల నుండి చిత్రపరిశ్రమలో రానిస్తూ ఎంతో అనుభవం ఉన్న రమ్యకృష్ణ సైతం కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పడం ఆశ్చర్యకరంగా ఉంది. ఓ సంధర్బంలో రమ్యకృష్ణ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా కామన్ అయిపోయిందని రమ్యకృష్ణ వ్యాఖ్యానించింంది.
కేవలం ఇది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదని అన్ని ఇండస్ట్రీలలో ఇది ఉందని రమ్యకృష్ణ స్పష్టం చేసింది. సినిమా ఇండస్ట్రీలో రానించాలంటే కొన్ని కొన్ని చోట్ల సర్దుకుపోక తప్పదు అంటూ వ్యాక్యానించింది. ఎక్కడ సర్దుకుపోవాలి ఎక్కడ సర్దుకుపోకూడదు అనే విషయాలను తామే నిర్నయించుకోవాలని చెప్పింది. ఇది అందరికీ తెలిసిన విషయమే అని స్టార్ అవ్వాలంటే కొన్ని చోట్ల సర్దుకుపోవాల్సిందేనని… గదుల్లోకి వెళ్లాల్సిందే అని రమ్యకృష్ణ బాంబు పేల్చింది.
రమ్యకృష్ణ నోటి నుండి ఇలాంటి మాటలు ఆశ్చర్యకరం. ఇక కొన్నేళ్ల పాటూ టాలీవుడ్ లో హీరోయిన్ గా రానించి… ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్యమైన పాత్రలు చేసే రమ్యకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఇక కొత్తగా సినిమాల్లోకి వస్తున్న హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రమ్య చేసిన వ్యాఖ్యలతో ఆమెను అంతలా ఇబ్బంది పెట్టింది ఎవరు ? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అందుకేనేమో సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తూ ఉంటారు. ఒకవేళ ఎంట్రీ ఇచ్చినా స్టార్స్ గా ఎదగలేరు.