అక్కినేని కుటుంబానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తన నట వారసుడు అఖిల్ మొదటి సినిమా ప్లాప్ అవ్వడంతో పాటు ఇప్పుడు రెండో సినిమా హలో కు ఎక్కడలేని తలపోట్లు చుట్టుకోవడంతో కింగ్ నాగార్జున తీవ్ర డిప్రెషన్ లో ఉన్నాడు. ఈ దశలో ‘హలో’ సినిమా విషయంలో దిల్ రాజు అడ్డు పడడంతో నాగార్జున అయన మీద పీకల్లోతు కోపం పెంచుకున్నాడు.
అసలే ఒకపక్క ఆఖిల్ నటించిన ‘హలో’ సినిమా ఏమవ్వుద్దా అనే టెన్షన్ లో ఉన్న నాగ్ కు యూట్యూబ్ కూడా షాక్ ఇచ్చింది. ఇటీవలే విడుదలైన హలో టీజర్‌కు యూట్యూబ్‌లో కాపీరైట్ పడటంతో టీజర్‌ను తొలిగించారు. దాంతో పరువు పోయి, షాక్‌లో ఉన్న చిత్ర యూనిట్ సభ్యులకు తాజాగా మరో షాక్ తలిగింది. ‘హలో’కు పోటీగా నాని ‘ఎంసీఏ’ చిత్రం విడుదల కాబోతుంది.
ముందుగా అనుకున్న ప్రకారం ‘ఎంసీఏ’ చిత్రం క్రిస్మస్కు విడుదల అవ్వాల్సి ఉంది. కాని దిల్‌రాజుతో నాగార్జున మాట్లాడి వారం రోజుల ముందే అంటే డిసెంబర్ రెండవ వారంలోనే విడుదల చేసేలా ఒప్పించాడు. కానీ డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి కారణం గా సినిమాను అనుకున్న సమాయానికి విడుదల చేయాలని దిల్‌రాజు నిశ్చయించుకున్నాడు.
‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో నాని, ఫిదా ఫెమ్ సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నాగార్జున ఒత్తిడి మేరకు ప్రకారం ఈ సినిమాను ముందే విడుదల చేయాలని నిర్ణయించుకుని రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. కాని ముందే విడుదల చేయడం వల్ల సెలవులను మిస్ అవుతామనే ఉద్దేశ్యంతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో దిల్‌రాజు ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయాడట.
డిసెంబర్ 22న ‘హలో’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ ఒక్క రోజు ముందు నాని సినిమా విడుదల అయితే ఖచ్చితంగా అది అఖిల్ సినిమాకు దెబ్బ అని చెప్పుకోవచ్చు. అందుకే నాగార్జున ‘ఎంసీఏ’ విడుదలపై ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 23వ తారీకున అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’ విడుదల కాబోతుంది. ఈ మూడు సినిమాల్లో ఎక్కువగా ‘మిడిల్ క్లాస్’ అబ్బాయి సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం ప్రేక్షకుల హృదయాలను ఏ సినిమా గెలుచుకుంటుందో.