Movies" ఆట నాదే వేట నాదే "

” ఆట నాదే వేట నాదే “

అవును మీరు చదువుతున్నది నిజం హీరో రాజశేఖర్ – విక్టరీ వెంకటేష్ బావా బావమరుదులు కాబోతున్నారు. కాకపోతే ఇది కేవలం సినిమాలో మాత్రమే. గరుడవేగ సినిమాతో సక్సస్ ను అందుకున్న రాజశేఖర్ కేవలం హీరోగా కాకుండా విలన్ పాత్రలకు, ప్రత్యేక పాత్రలకు తాను సిద్ధం అంటూ సంకేతాలను ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా తేజ డైరెక్షన్లో వెంకటేష్ నటించే ” ఆట నాదే వేట నాదే ” మూవీ 13న వెంకీ బర్త్ డే రోజు స్టార్ట్ అవుతోంది. ఈ మూవీలో వెంకీ బావ రోల్‌లో డా. రాజశేఖర్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల జోరు ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఈ విషయాన్నీ బాగా కనిపెట్టిన హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలలో నటించేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు.

దర్శకుడు తేజ వెంకటేష్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో మరో హీరోకి కూడా స్థానం ఉంది. ఈ పాత్ర కోసం మొదట నారా రోహిత్, మాధవన్, సుమంత్ లను పరిశీలించారు. అయితే తాజాగా హీరో రాజశేఖర్ ని తీసుకోవాలని నిర్ణయానికి చిత్ర యూనిట్ వచ్చెయ్యడంతో బావ బావమర్థులుగా వెంకీ రాజశేఖర్ లు కనువిందు చేయనున్నారు.
వాస్తవానికి తేజ దర్శకత్వం వహించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా రాజశేఖర్ చేయాల్సింది. కానీ, అప్పట్లో వీలుపడలేదు. మళ్లీ తేజ సినిమాలో రాజశేఖర్ ని తీసుకోవడం ద్వారా మళ్లీ ఆ లోటు పూడ్చుకున్నట్టు కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news