సినీ హీరో మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ ఇద్దరికి ఇది రెండో పెళ్లి. మౌనికకు మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం ధైరవ్ రెడ్డి ఉన్నాడు. ఇక ఈ జంట తమ సంసారం జీవితం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికకు ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తమ ఇద్దరి ప్రయాణంతో పాటు పెళ్లి విజువల్స్‌తో ఓ స్పెషల్ సాంగ్ చేయించి మరీ మౌనికకు సర్ఫ్రైజ్ ఇచ్చాడు.
డెడికేటెడ్ టు మౌనిక అంటూ యూట్యూబ్ వేదికగా మనోజ్ ఆ సాంగ్ రిలీజ్ చేశాడు. అందులో మంచు మనోజ్ ఆయన కుటుంబ సభ్యులతో పాటు మౌనిక ఫ్యామిలీ, అటు పెళ్లి వేడుకలు ఉన్నాయి. యేం మనసో యేం మనసో.. యేం వరసో యేం వరసో అంటూ సాగే ఈ పాట చాలా బ్రహ్మాండంగా వచ్చింది. హల్దీ మెహందీ ఫంక్షన్స్ ఆ తర్వాత పెళ్లి విజువల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి.
ఇక విజువల్స్‌తో పాటు సాంగ్ కూడా అదిరిపోయింది. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా… అచ్చు రాజమణి మ్యూజిక్ డైరెక్ట్ చేసి పాడడం విశేషం. ఈ సాంగ్‌కు లార్డ్ శివ దర్శకత్వం వహిస్తున్నట్లు వీడియోలో వెల్లడించారు. సాంగ్‌తో పాటు విజువల్స్ అయితే మెస్మరైజ్ చేస్తున్నాయి. వీడియో చివర్లో అంతా శివుడి ఆజ్ఞ అని వెల్లడించారు.
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మనోజ్ – మౌనిక దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కలకాలం ఇలాగే హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నారు. ఈ వీడియో సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.