Moviesకోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రామ్ ..ఒక్క రూపాయి కూడా అకౌంట్లో ఉంచుకోడు...

కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రామ్ ..ఒక్క రూపాయి కూడా అకౌంట్లో ఉంచుకోడు ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ..ఎనర్జిటిక్ హీరో అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు రామ్ పోతినేని . దేవదాసు అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ప్రజెంట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా ఖచ్చితంగా రాం పోతినేని కి మంచి కమ్ బ్యాక్ ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో చాలా డల్ గా ఉండే రాం పోతినేనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా ప్రస్తుతం రామ్ పోతినేని ఒక్కొక్క సినిమాకి 25 కోట్ల నుంచి 40 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే డైరెక్టర్ అడ్వాన్స్ కింద ఇచ్చిన అమౌంట్ .. లేక సినిమా కంప్లీట్ అయ్యాక ఫైనల్ అమౌంట్ గానీ.. అకౌంట్ లో పడిన మరోక్షణం రామ్ పోతినేని తన అమ్మ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తారట . ఒక్క రూపాయి కూడా ఎప్పుడు తన అకౌంట్ లో పెట్టుకోవడం ఇష్టం లేదట. దానికి రీజన్ కూడా ఉంది..

చిన్నప్పటినుంచి తన తల్లిదండ్రులు ఆయనను కష్టపడి పెంచారని.. మరీ ముఖ్యంగా ఆయన తన తల్లి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొని తనని ఈ స్థాయికి తీసుకొచ్చిందని ..ఆ కారణంగానే రామ్ పోతినేని డబ్బు విషయంలో “మా అమ్మే నాకు ఇప్పుడు ఇవ్వాలి కానీ నేను మా అమ్మకి ఇవ్వకూడదు అన్న కారణంగా ..వారు నన్ను అడగడానికి మొహమాట పడకూడదు అన్న కారణంగా.. మొత్తం అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తారట”.

ఆశ్చర్యం ఏంటంటే మొదటి నుంచి ఇప్పటివరకు అంతా అలానే జరుగుతుందట . అంతేకాదు ఇప్పటికి రామ్ పోతినేని ఏదైనా అవసరమైతే అమ్మ గారిని అడిగి డబ్బులు తీసుకుంటారు తప్పిస్తే తన అకౌంట్లో స్వతహాగా ఉన్న డబ్బులని ఎప్పుడూ తీసుకోడట. వాళ్ళ అమ్మగారు సినిమాకి సంబంధించిన డబ్బులు రామ్ తన ఖాతాలో వేసిన తర్వాత కొంచెం డబ్బులను పాకెట్ మనీ కింద ఇస్తూ ఉంటుందట . వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం అంటున్నారు రామ్ పోతినేని ఫ్యాన్స్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news