గత ఆరేడు సంవత్సరాలుగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పట్టిందల్లా బంగారం అవుతోంది. ఎన్టీఆర్ ఏం చేసిన బ్రేకులు లేకుండా దూసుకుపోతున్నాడు. టెంపర్ సినిమాకు ముందు వరకు ఎన్టీఆర్ ఎన్నో కష్టాలు.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. 2015లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా సూపర్ హిట్ అయింది. అక్కడ నుంచి ఎన్టీఆర్ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుసగా టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ – జై లవకుశ – అరవింద సమేత -త్రిబుల్ ఆర్ ఇలా ఆరు వరుస హిట్ సినిమాలు ఎన్టీఆర్ ఖాతాలో పడ్డాయి.
టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్ హీరోలలో ఏ హీరోకు కూడా వరుసగా ఆరు హిట్లు లేవు. ఇలాంటి అరుదైన ఘనత ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ తర్వాత ఒక ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యమైంది. త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇప్పుడు వరుస పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. ప్రస్తుతం చేసే కొరటాల శివ సినిమా.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా రెండూ పాన్ ఇండియా ప్రాజెక్టులు కావటం విశేషం.
ఇక ఎన్టీఆర్ 32వ సినిమా కూడా ఓకే అయింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి వార్ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న వార్ 2 సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడు. పైగా ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరో కాగా.. ఎన్టీఆర్ విలన్ గా నటించడం మరో విశేషం. ఆదిత్య చోప్రా నిర్మించే ఈ సినిమాకు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ నేషనల్ లెవెల్ లో మరింత పెరుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సినిమాలో నటిస్తున్నందుకుగాను ఎన్టీఆర్కు రు. 80 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా బాలీవుడ్లోకి ఎన్టీఆర్ అలా ఎంటర్ అయ్యాడో లేదో.. ఏకంగా రు. 80 కోట్ల రెమ్యూనరేషన్ ముడుతోంది. ఒకటి రెండు సినిమాలు చేస్తే ఎన్టీఆర్ రు. 100 కోట్ల హీరో అయిపోతాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా ఎన్టీఆర్ క్రేజ్ కు ఇప్పట్లో బ్రేకులు పడే ఛాన్సులే లేవు.