Moviesఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు భార్య .. ఇక ఒక్కోక్కడికి...

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు భార్య .. ఇక ఒక్కోక్కడికి సీటు చిరిగిపోవాల్సిందే..!!

ఇటీవల కాలంలో సినిమా రంగంలో సెలబ్రిటీల ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదో ఒక వ్యాపారం లోకి ఎంటర్ అవుతున్నారు. టాలీవుడ్ మాట‌ల మాంత్రికుడు, స్టార్ డైరెక్ట‌ర్‌ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు తన భార్య సౌజన్యను నిర్మాతగా పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఇక రాజమౌళి ఫ్యామిలీ ఎప్పుడు సినిమాల్లోనే పనిచేస్తూ ఉంటుంది. రాజ‌మౌళి భార్య ర‌మా ఆయ‌న సినిమాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేస్తారు.

ఇక టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు భార్య వైఘారెడ్డి కూడా ఇప్పుడు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు తహతహలాడుతున్నారు. వాస్తవంగా ఆమె ఎప్పటినుంచో సినిమా నిర్మాణ రంగంలోకి రావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దిల్ రాజు ఇప్పుడు పెద్ద నిర్మాత.. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు భార్య వైఘారెడ్డి కూడా రాజు నిర్మించే సినిమాల నిర్మాణ బాధ్యతలను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.

అలాగే ఆమె త్వరలోనే నిర్మాతగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలాగే దిల్ రాజు నిర్మించే రెండు.. మూడు హిందీ సినిమాల నిర్మాణ బాధ్యతలను కూడా వైఘారెడ్డి హేండిల్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో షాహిద్‌ కపూర్ హీరోగా నటిస్తాడని సమాచారం. ఇప్పటికే ఆయన కుమార్తె హర్షిత, మేనల్లుడు హర్షిత్ రెడ్డి దిల్ రాజు ప్రొడక్షన్ పేరుతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.

ఈ బ్యానర్ మీద బలగం సినిమా నిర్మించగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇక దిల్ రాజు సోదరుడు సురేష్ కుమారుడు ఆశీష్‌ రెడ్డి ఇటీవల రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇలా దిల్ రాజు కుటుంబం నుంచి ఒక్కొక్కరు ఒక్కో రంగంలోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ కోవలోనే తన భార్య వైఘారెడ్డి కూడా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వనన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news