Moviesపాపం.. ఆ క్రేజీ హీరోయిన్ ఐదో భాయ్‌ఫ్రెండ్‌తో కూడా బ్రేక‌ప్‌..!

పాపం.. ఆ క్రేజీ హీరోయిన్ ఐదో భాయ్‌ఫ్రెండ్‌తో కూడా బ్రేక‌ప్‌..!

పాపం ఆ హీరోయిన్ కు అస్సలు ప్రేమాయణాలు కలిసి రావటం లేదు. ఎన్నిసార్లు ప్రేమలో పడ్డ ఆ ప్రేమ ఎక్కువకాలం నిలవడం లేదు. ఖడ్గం బ్యూటీ కిమ్‌శర్మ ప్రేమాయణాలు ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటాయి. ఇప్పటికే ఐదుగురు బాయ్ ఫ్రెండ్స్ కి బ్రేకప్ చెప్పిన ఆమె కెన్యా డ్రగ్ మాఫియా డాన్ అలీ పుంజాని పెళ్లాడింది. నైరోబీలో కొన్నేళ్లపాటు అతనితో కలిసి కాపురం కూడా చేసింది. ఆ తర్వాత అతడు పెట్టే టార్చర్ భరించలేక అతడితో విడాకులు తీసుకుని తిరిగి ఇండియాకు వచ్చేసింది.

తనకంటే వయసులో చాలా పెద్దోడు అయినా కూడా ఆలీ పుంజాకు బాగా ఆస్తులు ఉన్నాయన్న ఆశతో కిమ్ అతడిని పిల్లాడింది. అయితే అతడు పెట్టే టార్చర్‌కు చుక్కలు కనపడటంతో వెంటనే విడాకులు ఇచ్చేసి ఇండియాకు వచ్చేసింది. గత రెండు మూడేళ్లుగా భారత టెన్నీస్‌ స్టార్, మాజీ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్‌తో కిమ్ ప్రేమాయణం కొనసాగిస్తోంది. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఈ ఇద్దరిలో ఎవరు అధికారికంగా ప్రస్తావించలేదు. అయితే కిమ్ లియోండర్ పేస్ తో కలిసి ఉన్న కొన్ని పోస్టులను డిలీట్ చేసేసింది. దీంతో ఇప్పుడు కొత్త సందేహాలు మొదలయ్యాయి. నిజానికి కిమ్ -ఫేస్ గ‌త కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా వీరిద్దరి హడావుడి కనిపించేది. ఈ జంట విహారయాత్రలు.. విదేశీ పర్యటనలతో బాగా ఎంజాయ్ చేసేవారు.

లియాండర్ పేస్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చేసి మరి కిమ్‌తో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు కిమ్ తన ఇన్‌స్టా ఖాతా నుంచి ఫేస్ ఫోటోలు తొలగించడంతో రకరకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గత సంవత్సరం అయితే కిమ్‌ ఫేస్‌తో తన ఒకటవ డేటింగ్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరి ఆనందం వ్యక్తం చేసింది.

అయితే ఈ యేడాది దాని గురించి చిన్న కామెంట్ కూడా చేయలేదు. అంతేకాకుండా గత ఏడాది లియోండర్ పేస్ పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్టులు కూడా తొలగించింది. ఏది ఏమైనా ఇప్పుడు తన ఐదో బాయ్ ఫ్రెండ్ కు కూడా కిమ్ బ్రేకప్ చెప్పేసిందని అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news