Moviesఆ నిర్మాత నగ్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు.. హీరోయిన్ సంచ‌ల‌న...

ఆ నిర్మాత నగ్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు.. హీరోయిన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ హీరోయిన్లకు లైంగీక వేధింపులు ఉండటం సర్వసాధారణం. అయితే కొందరు వాటిని బయట పెడుతుంటారు.. మరికొందరు బయట పెట్టలేరు. అవకాశాల కోసం హీరోతోను నిర్మాతతోను లేదా దర్శకుడుతోనో పక్కలో పడుకోవాలన్న కండిషన్లు చాలామంది హీరోయిన్లకు ఉంటాయి. అయితే కెరీర్ ప్రారంభంలో కొత్త హీరోయిన్లకు ఇవి మరీ ఎక్కువగా ఉంటాయి. ఈ తరహా క్యాస్టింగ్ కౌవుచ్‌ను హీరోయిన్లు కొన్ని సంవత్సరాల నుంచి ఎదుర్కొంటూనే వస్తున్నారు.

తాజాగా బెంగాలీ హీరోయిన్ స్వస్తిక ముఖర్జీ తన నిర్మాత తనను లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు బెంగాల్ సినిమా ఇండస్ట్రీలో ఇవి తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. బెంగాలలో స్వస్తిక స్టార్ హీరోయిన్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న శిబ్‌పూర్ సినిమా మే 5 న రిలీజ్ కానుంది. కొద్ది రోజుల్లో ఈ సినిమా రిలీజ్ పెట్టుకుని ఆ సినిమా నిర్మాతపై ఆమె ఘాటు ఆరోపణలు చేసి పెద్ద షాక్ ఇచ్చింది.

బెంగాల్ సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాత అయిన సందీప్ సర్కార్ తన కోరిక తీర్చాలని లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించింది. అలాగే మార్ఫింగ్ చేసి తన దగ్గర ఫోటోలు, వీడియోలను తనకు ఈమెయిల్ చేసి కోరిక తీర్చకపోతే ఇవి బయట పెడతానంటూ వేధిస్తున్నారని కూడా ఆమె ఆరోపించింది.
అలాగే తన ఫోటోలు, వీడియోలను ఫోర్న్ వెబ్‌సైట్లో పెడతానని బెదిరిస్తున్నాడని కూడా తెలిపింది.

ఈ విషయమై తాను ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని.. పోలీసులు స్పందించ‌ని పక్షంలో తాను ఈస్టర్ ఇండియా మోషన్ పిక్చర్స్ అసోసియేషన్‌ను సంప్రదిస్తానని తెలిపింది. అయితే స్వస్తికను డైరెక్టర్ ప్రేరేపించి నిర్మాతపై కేసు పెట్టమన్నట్టు కూడా ఇండస్ట్రీలో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

అయితే ఆ సినిమా డైరెక్టర్ వాటిని కొట్టి పారేశారు. ఇది అబద్ధమని.. తాను ఎలాంటి నెగటివ్ ప్రచారాన్ని నమ్మను.. స్వస్తిక లాంటి స్టార్ హీరోయిన్ ను ప్రోత్సహిస్తాను.. ఆమె ఎలాంటి కారణం లేకుండా ఇలాంటి ఆరోపణలు ఎందుకు ? చేస్తుందని దర్శకుడు చెబుతున్నారు. ఏది ఏమైనా స్వస్తిక బెంగాలీ అగ్ర‌ నిర్మాతపై చేసిన లైంగిక ఆరోపణలు మాత్రం ఇప్పుడు తీవ్రప్రకంపనలు రేపుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news