Moviesమ‌హేష్ కంటే న‌మ్ర‌త ముందు త‌న ప్రేమ‌ను చెప్పిన ఆ స్టార్...

మ‌హేష్ కంటే న‌మ్ర‌త ముందు త‌న ప్రేమ‌ను చెప్పిన ఆ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత మహేష్ జీవితంలోకి వచ్చాక మనోడి కెరీర్ను చాలా మార్చేసింది. న‌మ్ర‌త ఎప్పుడు అయితే మహేష్ లైఫ్ లోకి ఎంటర్ అయిందో ? మహేష్ స్టైల్ తో పాటు కథలు ఎంచుకోవడం.. సినిమా ప్రమోషన్లు ఇలా చాలా మార్పులు మహేష్ జీవితంలో జరిగాయి. అటు మహేష్ బాబు కెరీర్‌కు గైడెన్స్ ఇస్తూనే.. ఇటు భర్త బిజినెస్ విషయాలను మొత్తం న‌మ్ర‌త ఒంటి చేత్తో డీల్ చేస్తున్నారు. అటు కుటుంబ బాధ్యతలు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు.

ఇంకా చెప్పాలంటే మహేష్ క్రేజ్ న‌మ్ర‌త‌తో పెళ్లయ్యాకే డబుల్ అయింది. మహేష్ మార్కెట్ కూడా బాగా పెరిగింది. ఒకప్పుడు వరుస ప్లాపులతో ఇబ్బంది పడ్డ మహేష్.. ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇక నమ్రత – మహేష్ బాబుతో వంశీ సినిమా షూటింగ్ టైంలో ప్రేమలో పడిందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆస్ట్రేలియాలో దర్శకుడు బి.గోపాల్ 40 రోజులపాటు సుదీర్ఘమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు.

ఆ షెడ్యూల్ టైంలోనే మహేష్ – నమ్రత మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. అయితే నమ్రత తాను మహేష్ ను ప్రేమిస్తున్నానన్న విషయం.. మహేష్ కంటే ముందుగానే మరో స్టార్ హీరోకు చెప్పిందట. ఆ స్టార్ హీరో ఎవరో ? కాదు బాలీవుడ్ హీరో సంజయ్ దత్. వారిద్దరూ కలిసి మహేష్ మంజ్రేక‌ర్‌ దర్శకత్వంలో వాస్తవ్‌ సినిమాలో నటించారు. ఆ టైంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. వాస్తవ్‌ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సంజు ఎప్పుడు చిన్నపిల్లాడిలా ఉండేవాడట‌.

సెట్లోనే అందరిని కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఇక వంశీ సినిమా షూటింగ్ టైంలో తాను మహేష్ తో ప్రేమలో ఉన్నాను అన్న విషయాన్ని ముందుగా సంజయ్ దత్‌కే చెప్పాను.. మా ప్రేమ‌ విషయం తెలిసిన మొదటి వ్యక్తి కూడా సంజయ్ దత్ అని నమ్రత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలాగే వీరిద్దరి ప్రేమ పెళ్లికి కూడా సంజయ్ దత్ ఎంతో సాయం చేశారని బాలీవుడ్ వర్గాల్లో అప్పట్లో చర్చ నడిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news