ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ఓ హీరోని టార్గెట్ చేస్తూ అనసూయ ట్విట్ చేసినప్పటి నుంచి ఆమెను సోషల్ మీడియాలో ఆంటీ ఆంటీ అంటూ గుచ్చి గుచ్చి ట్రోల్ చేస్తున్నారు . ఈ వివాదం ఎంతవరకు వెళ్లిందో మనందరికీ బాగా తెలిసిందే. తనను ఆంటీ అంటూ విమర్శించే ప్రతి ఒక్కరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తూ ఏకంగా అనసూయ పోలీస్ కేసు కూడా పెట్టింది.
పెద్దల సర్దుబాటుతో ఈ విషయం కూల్ గా సాల్వ్ చేసుకున్న అనసూయకు తాజాగా మళ్లీ అదే ప్రశ్న ఎదురైంది . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే అనసూయ ను ఓ అభిమాని..” మీకు ఎందుకు ఆంటీ అంటే అంత కోపం..?” అంటూ అడిగారు . ఈ క్రమంలోనే అనసూయ స్టన్నింగ్ రిప్లై ఇచ్చింది . “ఆంటీ అనడంలో నాకు ఏ కోపం లేదు.. కానీ వాళ్ళు అనే అర్థం వెనుక వేరే ఉద్దేశం ఉంది ..అదే నాకు కోపం ..అయినా ఇప్పుడు నాకు అంత కోపం రావట్లేదు.. నేను చాలా మారిపోయాను.. అలాంటి వాళ్ళ మైండ్ మార్చడం కన్నా నాకు లైఫ్ లో ఎంతో ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయి “అంటూ అలాంటి వాళ్ళకి ఇచ్చి పడేసింది .
ఈ క్రమంలోనే ఆంటీ వెనక అంత పెద్ద బూతు అర్థం ఉందా ..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో కుర్రాళ్ళు నిజంగా చెడిపోయారని .. వయసుతో సంబంధం లేకుండా అడ్డు అదుపు అనేది లేకుండానే అమ్మాయిలు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు..!!