గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారిక డివర్స్ న్యూస్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . సోషల్ మీడియా ఆన్ చేసినా.. టీవీ పెట్టిన సరే మెగా డాటర్ నిహారిక డివోర్స్ తీసుకోబోతుంది అన్న న్యూస్ లే ఎక్కువగా వినిపిస్తున్నాయి . దానంతటకీ కారణం రీసెంట్ గానే మెగా డాటర్ నిహారిక భర్త జొన్నగడ్డ చైతన్య ఆమెతో పెళ్లి జరిగిన పిక్స్ ను డిలీట్ చేశాడు. అంతేకాదు ఒకరినొకరు ఇద్దరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారు .
ఈ క్రమంలోనే కచ్చితంగా ఈ జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే మెగా డాటర్ డివర్స్ విషయంలో షాకింగ్ న్యూస్ బయటపడింది. నిజానికి ఈ జంట విడాకులు తీసుకోవాలి అని అనుకోలేదని .. మాట మాట పెరిగి పెద్దల మద్దిస్తం వరకు వెళ్లిన ఈ ఇష్యూలో ఓ వ్యక్తి తల దూర్చి.. ఇలాంటి నిర్ణయం తీసుకునేలా చేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
అంతేకాదు నిహారిక కు డివర్స్ ఇవ్వాలంటే నాగబాబు పెట్టిన క్రేజీ కండిషన్ చూసి చైతన్యకు దిమ్మతిరిగిపోయి ఉంటది . నిహారికతో డివర్స్ తీసుకోవాలంటే పెళ్లి కోసం పెట్టిన ఖర్చు మొత్తం వెనక్కి ఇవ్వాలని.. పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ లు కూడా వెనక్కి ఇచ్చేయాలి అంటూ నాగబాబు క్రేజీ కండిషన్ పెట్టాడట . ఈ క్రమంలోనే మెగా అల్లుడు జొన్నలగడ్డ చైతన్య సందిగ్ధంలో పడ్డాడు అంటూ తెలుస్తుంది.
దాదాపు కొన్ని కోట్లు ఖర్చు చేసి మరి మెగా డాటర్ నిహారిక పెళ్లి చేశారు . ఇప్పుడు ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటే ఎలా ..? అంతేకాదు తన కూతుర్ని టార్చర్ చేసినందుకు అంత లీగల్ గా ప్రొసీడ్ అవుతాము అని వార్న్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే నాగబాబుని ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . కూతురు జీవితం పాడు అవ్వడానికి నువ్వే కారణం అవుతున్నావు.. అర్థం చేసుకో అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. దీంతో మరోసారి ఇండస్ట్రీలో అమ్మడి విడాకుల మ్యాటర్ వైరల్ గా మారింది..!!