ఇండియన్ సినిమా పరిశ్రమలో గత రెండు మూడేళ్లుగా క్యాస్టింగ్ కౌచ్ బాగా పాపులర్ అవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా లైంగిక వేధింపులకు గురవ్వుతూ, అవకాశాల పేరుతో మోసపోయిన హీరోయిన్లు, నటీమణులు.. బుల్లితెర నటిమణులు ఎంతోమంది ఓపెన్ అవుతున్నారు. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ధైర్యంగా చెప్పేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ సాధిక బాధకాలు గురించి పంచుకుంటున్నారు. క్యాస్టింగ్ కౌచ్ అంటే కేవలం మహిళలు మాత్రమే లైంగిక వేధింపులు ఎదుర్కొంటారు.. అని అందరూ అనుకుంటారు.
అయితే ఇందుకు విరుద్ధంగా కొంతమంది హీరోలు, నటులు కూడా లైంగిక వేధింపులకు గురైన సందర్భాలు వస్తున్నాయి. మన టాలీవుడ్ లోనే ఓ మహిళా నిర్మాత, యంగ్ హీరోలతో పాటు, యంగ్ డైరెక్టర్లను కూడా ఇలా టార్చర్ పెడుతుంది అన్న ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు ఏకంగా ఒక స్టార్ హీరో.. ఒక హీరోయిన్ నుంచి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పటం షాకింగ్ గా మారింది.
ఆ స్టార్ హీరో ఎవరో ? కాదు భోజ్పురి నటుడు రవి కిషన్ సింగ్. అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాలో హీరోకు ధీటుగా విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత కిక్ 2 సినిమాలోను నటించాడు. రవికిషన్ సింగ్ అంటే రేసుగుర్రం విలన్గా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో బిజెపి నుంచి లోక్సభకు కూడా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రవికిషన్ ముక్కుసూటి మనిషి. ప్రజలకు సాయం చేయాలన్నా.. ప్రజల సాధకబాధకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నా.. ఎవరికి భయపడకుండా ముక్కుసూటిగా చేసేస్తారు.
ఒకప్పుడు భోజపురిలో ఆయన స్టార్ హీరో. ఇక క్యాస్టింగ్ కోచ్ గురించి రవికిషన్ మాట్లాడుతూ హీరోయిన్లకు మాత్రమే లైంగిక వేధింపులు జరుగుతాయి అనుకోవటం పొరపాటు. చాలామంది అబ్బాయిలు కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బాధితులు అని కుండ బద్దలు కొట్టేశారు. నేను కూడా దాన్నుంచి తప్పించుకుని బయటపడ్డానని.. అవకాశాల కోసం అడ్డదారులు తొక్క కూడదు అని ముందుగానే డిసైడ్ అయ్యాను అని ఆయన తెలిపారు. తాను కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ నా దగ్గరికి వచ్చి రాత్రికి మా ఇంటికి కాఫీకి రమ్మని ఆహ్వానించింది.
ఎవరైనా ఉదయం లేదా మధ్యాహ్నం కాకుండా.. రాత్రికి కాఫీకి పిలవటం ఏంటని నాకు అనుమానం ?వచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రవర్తన చూశాక ఆమె ఎందుకు ? పిలిచిందో నాకు అర్థమైందని.. వెంటనే నేను రానని నో చెప్పానని రవికిషన్ తెలిపారు. అయితే ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో చాలా పెద్ద స్థాయిలో ఉంది.. ఆమె పేరు చెప్పలేను. ఇండస్ట్రీ మొత్తానికి ఆమె ఎవరో తెలుసు అంటూ రవికిషన్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఇప్పుడు రవికిషన్ చేసిన వ్యాఖ్యలు ఇండియన్ సినిమా వర్గాల్లో సంచలనంగా మారాయి. ఒక ఎంపీ హోదాలో ఉన్న ఒకప్పటి స్టార్ హీరో.. ఓ స్టార్ హీరోయిన్ చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యాడా అని ఎవరికి వారు ఆరాలు పేరాలు తీస్తున్నారు.