Gossipsశ్రీ ముఖి పెళ్లికి సల్మాన్ కి లింకేంటి ..? 

శ్రీ ముఖి పెళ్లికి సల్మాన్ కి లింకేంటి ..? 

బుల్లితెరపై బాగా పాపులర్ అవుతున్న బ్యూటీ. తన అందం, యాటిట్యూడ్, చలాకీతనాని….తన హాట సెక్స్ అప్పీల్ జోడించి ఇటు బుల్లితెరపై, అటు వెండితెర అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది.

సోషల్ మీడియాలో ఎంత ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే అన్ని ఎక్కువ అవకాశాలు దక్కుతాయనే విషయాన్ని గ్రహించిన శ్రీముఖి వెరైటీ వెరైటీ డబ్ స్మాష్ వీడియోలు, సైనింగ్ క్లిప్స్, సెల్పీలు పోస్టు చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

తాజాగా ట్విటర్లో ఫాలోయర్లతో సోషల్ మీడియా లో చాట్ చేసిన ఈ ముద్దు బొద్దు గుమ్మ వారితో ఆసక్తికర విషయాలే చర్చించింది. ఆ సందర్భంలో చాలా మంది ఒకే ప్రశ్నను పదే పదే అడిగారు. పెళ్లి విషయంలో తెగ ఆరా తీశారు. నువ్వు అందంగా ఉంటావ్, ముద్దుగా, బొద్దుగా ఉంటావ్.. అంటూ పొగడ్తలు ఒకవైపు రాగా, మరోవైపు పెళ్లెప్పుడు? అనే ప్రశ్న పదే పదే ఎదురైంది. దీంతో శ్రీముఖి స్పందించింది. ఇప్పుడప్పుడే ఆ ఆలోచన లేదు అనే విషయాన్ని తన స్టైల్లో ఎలా చెప్పుకోచ్చిందో తెలుసా..?

నా పెళ్లి విషయంలో మీరు ఎందుకు కంగారుపడుతున్నారు … పెళ్లి విషయంలో నాకు సల్మాన్ ఖానే ఆదర్శం’ అంటూ ట్వీట్లో సమాధానం ఇచ్చింది శ్రీముఖి. యాభై యేళ్ల వయసు దాటినా.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ పెళ్లి ఆలోచన లేకుండా బతికేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మీకెందుకు అంత ఆసక్తి, నేను పెళ్లి చేసుకుంటే ఏంటి? చేసుకోకపోతే మీకేంటి?’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు సల్మాన్. శ్రీముఖి కూడా అలాగే సమాధానం చెప్పి సల్మాన్ నేను ఒక్కటే అని చెప్పుకొస్తుంది. అంటే ఈ ముద్దు గుమ్మ యాభై ఏళ్ళు డేట్ వరకు పెళ్లి చేసుకోదా ఏంటి ..?

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news