Gossipsఅఖిల్ కోసం సమంత ఏం చేస్తుందో తెలుసా..?

అఖిల్ కోసం సమంత ఏం చేస్తుందో తెలుసా..?

అక్కినేని అఖిల్ రెండవ సినిమాగా విక్రం కుమార్ డైరక్షన్ లో చేస్తున్న సినిమా హలో. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రీసెంట్ గా సినిమా నుండి వచ్చిన టీజర్ స్టంట్స్ కు సిని ప్రియులు ఫిదా అయ్యారు. అఖిల్ ఫ్లాప్ చాయలను ఈ సినిమా మీద పడకుండా హలోతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్.

స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమలో కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈమధ్యనే అక్కినేని కోడలిగా అడుగుపెట్టిన సమంత హలోలో ఓ క్యామియో రోల్ చేస్తుందట. నాగార్జున సలహా మేరకే సమంత హలో సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటుందని తెలుస్తుంది.

మరిది గారికి చేస్తున్న వదిన సాయం ఎంతవరకు ఊపయోగపడుతుందో ఏమో కాని హలోతో అఖిల్ కమర్షియల్ హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. మరి అఖిల్ కోరుకునే సూపర్ హిట్ వస్తుందా రాదా అన్నది తెలియాలంటే డిసెంబర్ 22దాకా వెయిట్ చేయాల్సిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news