Newsకృష్ణవంశీ - రమ్యకృష్ణల మధ్య విబేధాలు.. వారి ప్రేమ కథ ఇదే!!

కృష్ణవంశీ – రమ్యకృష్ణల మధ్య విబేధాలు.. వారి ప్రేమ కథ ఇదే!!

Creative director Krishna Vamshi finally talked about his love story with Ramya Krishna in TNR interview. He said that ramya krishna has attracted towards him after watching megalalo song in gulabi movie which is his first movie.

టాలీవుడ్‌లో కాస్త ప్రశాంత వాతావరణం కనిపిస్తే చాలు.. గాసిప్‌రాయుళ్ళు ఏదో ఓ రూమర్ పుట్టించి, సంచలనం సృష్టిస్తారు. సినిమాల పరంగానే కాదు.. వారి పర్సనల్ లైఫ్‌ మీద కూడా పుకార్లు క్రియేట్ చేస్తారు. హీరోల మధ్య గొడవైందనో, దంపతులు విడిపోతున్నారనో.. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా ఎన్నెన్నో! దాదాపు సెలబ్రిటీలందరూ వీటి బారిన పడినవాళ్లే. ఆ జాబితాలో కృష్ణవంశీ-రమ్యకృష్ణ జంట కూడా ఒకటి. అప్పట్లో వీరిమధ్య ఏవో విభేదాలు ఏర్పడ్డాయని, అందుకే దూరంగా ఉంటున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అందులో ఏమాత్రం వాస్తవం లేదని కృష్ణవంశీ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చినా.. ఆ రూమర్ మాత్రం ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి ఆయన ఆ వార్తల్ని ఖండించారు. అంతేకాదు.. తమ లవ్ స్టోరీని కూడా వివరించారు.

కృష్ణవంశీ దర్శకునిగా పరిచయమవుతూ తీసిన తొలిచిత్రం ‘గులాబీ’ సినిమాలోని ‘మేఘాలలో తేలిపొమ్మంది’ అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ పాటకి వ్యతిరేకంగా చాలామంది నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ పాటపై వర్మ, కృష్ణవంశీ కి మధ్య వాదోపవాదాలు కూడా జరిగాయి. తీరా సినిమా రిలీజయ్యాక ఆ పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అందరిలాగే రమ్యకృష్ణని ఆ పాట ఆకర్షించింది. అప్పటినుంచి కృష్ణవంశీ గురించి ఆరాతీయడం మొదలుపెట్టిన ఆమె.. ఓ సందర్భంలో ఏదో సినిమా షూటింగ్ కి కృష్ణ వంశీ వెలితే అక్కడ ఉన్న రమ్య కృష్ణ బ్రహ్మానందంతో కృష్ణ వంశితో పరిచయం చేయించాలని రిక్వెస్ట్ చేసిందట. ఈ విషయం వెంటనే కృష్ణ వంశీకి బ్రహ్మానందం చెప్పగా.. ఆ సమయంలో తన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని కృష్ణ వంశీ తెలిపారు. ఎందుకంటే.. అప్పట్లో రమ్యకృష్ణ ఓ స్టార్ హీరోయిన్. అలాంటి ఆమె.. ఒక్క సినిమానే తీసిన తనలాంటి చిన్న డైరెక్టర్‌తో కలవాలని కోరుకోవడం నిజంగా ఆశ్చర్యకరమని అన్నారు. అప్పుడు తమ మధ్య పరిచయం ఏర్పడగా.. చాలా క్లోజ్‌గా మూవ్ అవుతూ వచ్చామని, తమ ప్రేమని వెల్లడించుకోకుండానే ఒక్కటయ్యామని కృష్ణ వంశీ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news