Bhaktiముఖం మీద కనుబొమ్మల మధ్య బొట్టు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ?

ముఖం మీద కనుబొమ్మల మధ్య బొట్టు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ?

మన కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది.అది వేడి పుట్టిస్తూ ఉంటుంది.అందుకే అక్కడ చల్లదనం అవసరం.పసుపు,కుంకుమ,తిలకం,భస్మం,చందనం,శ్రీచూర్ణం వగైరాలు ఈ అవసరాన్ని తెరుస్తాయి.ముఖం మీద బొట్టు గుండ్రంగా పెట్టుకోవాలా?అడ్డంగా పెట్టుకోవాలా?నిలువుగా పెట్టుకోవాలా? అని అడిగితే ఎవరికిష్టం వచ్చినట్టు వారు, వారివారి వంశాచారం ప్రకారం పెట్టుకోవచ్చు.

ఏ బొట్టయినా ముఖానికి అందాన్ని, తేజస్సును ఇస్తుంది.మొత్తం మీద అడ్డంగా పెట్టుకునే భస్మం ఆయుర్వుద్ధిని ఐశ్వరాభివృద్ధిని కలిగిస్తుంది.నిలువుగా పెట్టుకునే శ్రీచూర్ణం బ్రహ్మరంధ్రము ద్వారా జీవాత్మ చేరుకునే పరమపదాన్ని సూచిస్తుంది.కనుబొమ్మల మధ్య బొట్టు నాడీ మండలంపై అనుకూల ప్రభావం చూపుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news