బాలకృష్ణ కెరీర్లో సమరసింహారెడ్డి ఎంత పెద్ద హిట్ సినిమాయో తెలిసిందే. 1999 సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి స్నేహంకోసం సినిమాకు పోటీగా వచ్చింది. స్నేహంకోసం జనవరి 1న రిలీజ్ అయితే.. సమరసింహారెడ్డి సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఆ రోజుల్లోనే సంచలన విజయం సాధించడంతో పాటు అప్పటికి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా సిమ్రాన్, అంజలాఝవేరి, సంఘవి హీరోయిన్లుగా నటించారు. బి. గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆ రోజుల్లో 77 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య సుల్తాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే యేడాది సుల్తాన్ ఆ తర్వాత కృష్ణబాబు సినిమాలు చేశాడు.
ఇక సుల్తాన్ సినిమాకు శరత్ దర్శకత్వం వహించారు. బాలయ్య పెద్దన్నయ్య సినిమాకు ఆయనే డైరెక్టర్. సుల్తాన్ సినిమాలో దీప్తీ భట్నాగర్, రచన, రోజా నటించారు. ఈ సినిమాలో సీనియర్ నటులు కృష్ణ, కృష్ణంరాజు కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో బాలయ్య ఏకంగా 8 పాత్రల్లో కనిపిస్తారు. అప్పట్లో ఇది ఓ సెన్షేషనల్ అయ్యింది.
బాలయ్య అటు సుల్తాన్ గాను, ఇటు పోలీస్ ఆఫీసర్‌గాను కనిపిస్తారు. 1999 మే 27న రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకు ముందు విమర్శకుల నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినిమా ప్లాప్ అన్నారు. కానీ సమరసింహారెడ్డి మానియాలో ఈ సినిమా ఆ తర్వాత పుంజుకుని సూపర్ హిట్ అయ్యింది. అంటే సినిమా కొన్న వాళ్లకు మంచి లాభాలు వచ్చాయి. సినిమాలో పాటలతో పాటు బాలయ్య గెటప్‌లు, యాక్షన్ హైలెట్‌గా నిలిచాయి.