MoviesNBK 108 ఫ‌స్ట్‌లుక్‌లో ఆ సెంటిమెంట్ చూశారా... బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ అని...

NBK 108 ఫ‌స్ట్‌లుక్‌లో ఆ సెంటిమెంట్ చూశారా… బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ అని ఫిక్సైపోండి…!

నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ఫుల్ స్వింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్యకు చాలా ఏళ్ల తర్వాత వరుసగా రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరసింహారెడ్డి సినిమా అయితే ఏకంగా తొలిరోజు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి రు. 54 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. బాలయ్య కెరీర్లో ఈ వసూళ్లు ఆల్ టైం రికార్డ్ గా నిలిచిపోయాయి. ప్రస్తుతం బాలయ్య సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తన కెరీర్లో 108వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సాహూ గారపాటి, హ‌రీష్ పెద్ది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా నడుస్తోంది. బాలయ్య కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీలల నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జోడిగా నటిస్తోంది. బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ జైత్ర‌యాత్ర కొనసాగించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అనిల్ రావిపూడి – బాలయ్య కాంబినేషన్ అంటేనే కొత్తగా ఉంటుంది. దీనికి తోడు శ్రీలీల, కాజ‌ల్‌ లాంటి క్రేజీ హీరోయిన్లు తొలిసారిగా బాలయ్య సినిమాలో నటిస్తుండడంతో సినిమాకు మామూలు హైప్‌ లేదని చెప్పాలి.

ఇదే ఊపులో ఈ సినిమా మేకర్లు ఉగాది కానుకగా బ్లాస్టింగ్ లాంటి అప్డేట్ వదిలారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లలో బాలయ్య ఊహించని గెటప్‌ల‌లో కనిపిస్తున్నాడని చెప్పాలి. బాల‌య్య రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌ల్లో క‌నిపిస్తున్నాడు. ఓ లుక్ అయితే వింటేజ్ బాల‌య్య‌ను త‌ల‌పించేలా ఉంది. ఓవ‌రాల్‌గా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌తో అయితే అంచ‌నాలు మామూలుగా లేవు.

nbk108

ఈ సినిమాలో కూడా బాల‌య్య డ్యూయ‌ల్ రోల్లో న‌టిస్తున్నాడ‌నే అంటున్నారు. డ్యూయ‌ల్ రోల్ అంటే బాల‌య్య‌కు ఎంత మంచి సెంటిమెంటో చెప్ప‌క్క‌ర్లేదు. అఖండ‌, వీర‌సింహారెడ్డి రెండు సినిమాల్లోనూ డ్యూయ‌ల్ రోలే. మ‌రి ఇప్పుడు ఈ సినిమాలోనూ అదే సెంటిమెంట్ ఉంటే… పై పాజిటివ్ అంశాలు క‌లిసి ఇది కూడా ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ అవుతుంద‌ని బాల‌య్య ఫ్యాన్స్ న‌మ్మ‌కంతో ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news