ప్రస్తుత సమాజంలో రోజు ఎక్కడో ఒకచోట అత్యాచారం జరుగుతున్న విషయాలు మనం వింటూనే ఉన్నాము . కాగా రీసెంట్ కాలంలో ఇలాంటి వార్తలు మరింత ఎక్కువ అయిపోయాయి . అడ్డు అదుపు లేకుండా.. వయసు తేడా లేకుండా.. వావి వరస లేకుండా కొందరు మృగాలు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు . కాగా మరి కొంతమంది తాగిన మత్తులో రెచ్చిపోయి మరి మూగజీవాలను కూడా వదలకుండా హింసిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా బీహార్ లోని పాట్నాలో జరిగిన అత్యంత జుగుప్సాకరమైన సంఘటన ప్రముఖ హీరోయిన్ ప్రియమణి దృష్టికి రావడంతో ఆమె స్పందించింది . మనకు తెలిసిందే బీహార్ రాజధాని పాట్నాలో ఓ నీచోడు మూగజీవి పై దారుణంగా అత్యాచారం చేశారు . కుక్క పడుకొని ఉండగా ఆ కుక్కను లైంగికంగా వేధిస్తూ ..చాలా నీచంగా ఆ కుక్కని అత్యాచారం చేశాడు . దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దీనిపై జనాలు సైతం మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే అలాంటి నీచుడిని ఉరితీయాలి అంటూ జనాలు డిమాండ్ చేస్తున్నారు . అంతేకాదు హీరోయిన్ ప్రియమణి సైతం అతగాడి పై మండిపడింది. కుక్కల్ని కూడా వదలరా రా ..?అంటూ దారుణంగా అతగాడిపై బూతులు తిడుతున్న ఎమోజీని షేర్ చేసింది . దీనితో ఈ విషయం మరి కొంతమంది దృష్టికి వెళ్లడంతో ఆ వ్యక్తిని ఏకిపారేస్తున్నారు. అతగాడిని అడ్డంగా నరికేయాలని డిమాండ్ చేస్తున్నారు..!!