ఇది నిజంగా మెగా అభిమానులకి డబల్ ధమాకా అనే చెప్పాలి. పదేళ్లుగా ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేసిన మెగా వారసుడు రాక మరికొద్ది నెలలోనే ఉండబోతుంది అంటూ మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు . మనకు తెలిసిందే మెగాకోడలు ఉపాసన తల్లి కాబోతుంది . ఈ విషయాన్ని ఎప్పుడో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు . కాగా ఈ క్రమంలోనే ఉపాసన కూడా తన తల్లి కాబోతున్నందుకు సంతోషిస్తున్నానని పలు పోస్టులతో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. రీసెంట్ గానే మెగా కోడలు ఉపాసనకు శ్రీమంతం జరిగింది . ఫ్రెండ్స్ సమక్షంలో చాలా సింపుల్గా జరుపుకున్న ఈ శ్రీమంతంకి తాలూకా పిక్స్ కూడా వైరల్ అయ్యాయి.
కాగా రీసెంట్గా ఉపాసన భర్త రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకుంది. ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్ళిన ఆర్ఆర్ఆర్ టీం తో పాటు ఉపాసన కూడా అమెరికా చేరుకుంది. అక్కడ చరణ్ తో పాటు సందడి చేసింది . ఈ క్రమంలోనే ఆస్కార్ రెడ్ కార్పెట్ పై ఉపాసన దంపతులుగా నడవడం ప్రాధాన్యత సంతరించుకుంది . హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ రాంచరణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు .
ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ అవార్డు అందుకునే కొన్ని నిమిషాల ముందు చరణ్ – ఉపాసన మాట్లాడుతూ ..”ఆర్ఆర్ఆర్ టీం లో నేను భాగమైనందుకు సంతోషిస్తున్నానని.. కచ్చితంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అందుకుంటుందని ధీమా వ్యక్తం చేసింది. ఈ క్రమంలోని మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ కూడా బయట పెట్టాడు చరణ్. ఉపాసన ప్రెగ్నెంట్ ..మా జీవితంలోకి బిడ్డ రాకముందే ఆనందాలను తీసుకొస్తుంది . ఈ మూమెంట్ నేనెప్పటికీ మర్చిపోలేను . ఆరు నెలల్లోనే భారీ మార్పులు..మాకు మా బిడ్డ లక్ ని తీసుకొస్తున్నాడు.. మరి కొద్ది రోజుల్లోనే మా బేబీ మా చేతుల్లోకి రాబోతుంది అంటూ ఆనందం వ్యక్తం చేసాడు. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు ఉపాసనకి ఎన్నో నెల అంటూ అభిమానులు బుర్ర పూక్కునారు. అలాంటి వాళ్లకి హింట్ ఇచ్చేసాడు రాంచరణ్ . చరణ్ లెక్క ప్రకారం ఉపాసనకు మరో మూడు నెలల్లోనే డెలివరీ అవ్వబోతుంది రాంచరణ్ అవుతుంది. రామ్ చరణ్ కి పాప పుడుతుందా..? బాబు పుడతాడా..? అన్న ఇంట్రెస్టింగ్ చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!