తెలుగు సినిమా రంగంలో అలనాటి మేటినటి జయసుధ అంటే తెలియని వారు ఉండరు. జయసుధకు సహజనటి అన్న పేరు ఉంది. నిజంగానే ఆమె సినిమాల్లో నటించేటప్పుడు నటిస్తారు.. అనేకంటే జీవిస్తారు అనంత గొప్పగా తన పాత్రలో ఒదిగిపోయారు. 300కు పైగా సినిమాల్లో నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. దివంగత సీనియర్ నటీమణి విజయనిర్మలకు జయసుధ స్వయాన మేనకోడలు అవుతుంది. మద్రాసులో పుట్టి పెరిగిన జయసుధ తన అత్తమ్మ విజయనిర్మలను ఆదర్శంగా తీసుకునే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
అప్పటి తరం అగ్ర హీరోలు అందరితోనూ కలిసిన నటించిన జయసుధ తన కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే చేజేతులా కొన్ని తప్పులు చేశారు. కెరీర్ పరంగా మద్రాసులో స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడు ఆమె ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డారు. ఆ వ్యక్తి జయసుధ కోసం షూటింగ్ లు జరుగుతున్న ప్రాంతాలకు కూడా వచ్చేవాడు. అంత గాఢంగా ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. కృష్ణా జిల్లాకు చెందిన కాకర్లపూడి రాజేంద్రప్రసాద్.
ఒక సినిమా షూటింగ్ సమయంలో జయసుధతో రాజేంద్రప్రసాద్ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే ఈ ప్రేమ జయసద కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పెళ్ళికి నిరాకరించారు. అయినా జయసుధ కుటుంబ సభ్యుల మాట వినకుండా ఒక గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు చేసేదేం లేక విజయవాడలోని మొగల్రాజపురం లోని మధు కళ్యాణ మండపంలో వీరికి మళ్ళీ వివాహం చేశారు. అప్పట్లో వీరి వివాహానికి రామానాయుడు, అప్పటి జడ్జిగా ఉన్న నాదెండ్ల శ్రీనివాస్, బీపీ రామచంద్రన్, మురళీమోహన్, దాసరి నారాయణరావు లాంటి ప్రముఖులు హాజరయ్యారు.
అప్పట్లో వీరి పెళ్లి పెద్ద సంచలనం అయ్యింది. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. జయసుధ రాజేంద్ర ప్రసాద్ ను ఎంత తొందరపడి పెళ్లి చేసుకుందో.. అంతే త్వరగా విడిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమా రంగానికి చెందిన నితిన్ కపూర్ తో ఏర్పడిన పరిచయంతో మళ్ళీ ఆమెలో ప్రేమ పుట్టింది. ఈ జంటకు పిల్లలు పుట్టాక కూడా నితిన్‌తో ఆమెకు విభేదాలు వచ్చాయి.
దీంతో నితిన్ ముంబైలో ఉండేవాడు. జయసుధ మాత్రం హైదరాబాద్‌కే పరిమితం అయింది. అలా వీరిద్దరూ కొన్నాళ్లపాటు వేరువేరుగానే జీవితాలు వెల్లదీస్తూ వచ్చారు.. చివరకు నితిన్ ముంబై లోనే అనుమాన స్థితిలో మృతి చెందారు. సినిమాల్లో జయసుధ ఎంతో గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నా… ఆమె వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం వేసిన రాంగ్ స్టెప్పులు ఆమెకు శాపంగా మారాయి.