సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సరే ఐటమ్ గర్ల్స్ కి ఉన్న ఆ క్రేజ్.. ఆ కిక్,, పవర్ .. నార్మల్ హీరోయిన్స్ కి రానే రాదని చెప్పాలి . అందుకే స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేస్తున్న ముద్దుగుమ్మలు కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఐటమ్స్ గర్ల్ గా మార్చేస్తూ ఉన్న డైరెక్టర్ లు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆ లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటాడు సుకుమార్ . టాలీవుడ్ లెక్కల డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ తన సినిమాలో స్టార్ హీరోయిన్స్ ఐటెం గార్ల్స్ గా మార్చేస్తాడు అన్న విషయం అందరికి తెలిసిందే .
అయితే ఒకప్పట్లో ఐటెం సాంగ్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది పూరి జగన్నాథ్. ఆయన సినిమాల్లో ఐటం సాంగ్స్ ఎలా సంచలనాన్ని క్రియేట్ చేస్తాయో అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన పోకిరి సినిమాలో ఐటెం సాంగ్ అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది . “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే” అంటూ అదిరిపోయే లిరిక్స్ తో మోమైత్ ఖాన్ హాట్ ఫిజిక్స్ తో స్టేజిని దద్దరిల్లిపోయేలా చేసాడు పూరి జగన్నాథ్ . అప్పుడేంటి ఇప్పటికీ ఈ పాట టీవీలో వస్తుంటే ఓ అంటూ తెగ ఊపేస్తారు కుర్రాళ్లు.
అప్పట్లో ఈ సాంగ్ కి ఎంత క్రేజ్ ఉండింది అంటే మంచంలో ఉన్న ముసలాడు కూడా కర్ర పట్టుకొని చిందులేసేవాడు. ఆ పాటలో మోమైత్ ఖాన్ రెచ్చిపోయి పర్ఫామెన్స్ చేసింది. ఈ పాటతోనే ఓ వర్ నైట్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో మోమైత్ ఖాన్ నటించినప్పటికీ పెద్దగా క్రేజ్ దక్కలేదు . నేనింతే సినిమాలో కూడా మోమైత్ ఖాన్ నటించిన అయినా కానీ ఎందుకో జనం ఆకట్టుకోలేక పోయారు. తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటికి కూడా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది . ఈ క్రమంలోనే ప్రజెంట్ ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయింది. దానికి కారణం ఆమె బోల్డ్ నెస్ అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఇండస్ట్రీలో ఎవరికి నచ్చదు. అయితే మోమైత్ ఖాన్ ఇండస్ట్రీలో ఆఫర్లు రాకపోయినా పర్లేదు నా క్యారెక్టర్ ని చంపుకోను అంటూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంది. ఆ కారణంగానే మోమైత్ ఖాన్ ఇండస్ట్రీకి దూరమైంది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది.