తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తండ్రి పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. కానీ వాళ్ళందరిలోకి ప్రత్యేకం గోపీచంద్ . తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఆ తర్వాత తనదైన స్టైల్ లో సొంత టాలెంట్ తో సినిమా అవకాశాలను దక్కించుకుని.. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. గోపీచంద్ తొలివలపు అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గోపీచంద్ మొదటి సినిమా తోనే అన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకుని అభిమానులకి బిగ్ సర్ ప్రైజ్ చేశాడు.
ఆ తర్వాత తనదైన స్టైల్ లో ముందుకెళ్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే జయం – వర్షం – నిజం సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేసిన గోపీచంద్ కెరియర్ ఒక్కసారిగా లైఫ్ టర్న్ అయిపోయింది . అసలు గోపీచంద్ హీరో అవ్వడానికి ఇండస్ట్రీకి వచ్చాడు. ఇలా విలన్ పాత్రులు చేయడం ఏంటి..? అంటూ ఫ్రెండ్స్ బ్రెయిన్ వాష్ చేయడంతో మళ్ళీ హీరోగా తన కెరీర్ను స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే గోపీచంద్ హీరోగా కొన్ని సినిమాలను ఓకే చేసి పాజిటివ్ హిట్లు దక్కించుకున్నాడు . అయితే విలన్ గా చేసిన అంత క్రేజ్ మాత్రం దక్కలేకపోయింది .
ఈ క్రమంలోనే కొందరు ఫ్రెండ్స్ బోల్డ్ కంటెంట్ సజిస్ట్ చేశారు. విలన్ గా పలు పాత్రల్లొ గోపీచంద్ బాగా డొస్ పెంచి రొమాన్స్ చేసాడు. తెర పై ఆ సీన్స్ బాగా పండాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్స్ కూడా ఆయనకు అదే విధంగా ఉండే కథలను తెచ్చిపెట్టారు. కానీ గోపీచంద్ మాత్రం అలా చేయడానికి ఇష్టపడలేదు. హీరోగా సెటిల్ అవ్వకపోయినా పర్లేదు కానీ..నాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అంటూ ఆయన చెప్పుకు రావడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాదు ఒకవేళ నిజంగా గోపీచంద్ ఆ రోజుల్లో సిగ్గు లేకుండా అలాంటి ..సిగ్గుపడకుండా అలాంటి క్యారెక్టర్స్ చేసి ఉంటే ఇప్పుడు కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తున్న హీరోలలో ఒకరుగా ఉండేవారు. కోట్లకు కోట్ల ఆస్తిని వెనకేసుకొని నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలేసేవాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ గోపీచంద్ తనదైన స్టైల్ లో వచ్చిన సినిమాలలో నచ్చిన మూవీస్ యాక్సెప్ట్ చేస్తూ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు..!!